Published : 28 Jun 2022 03:05 IST

936 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు

2022 మొదటి త్రైమాసికంలో  

ఇందులో 64% యూపీఐతోనే

అగ్రస్థానంలో హైదరాబాద్‌

వరల్డ్‌లైన్‌ నివేదిక  

దిల్లీ

ఈ ఏడాది మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి)లో మనదేశంలో రూ.10.25 లక్షల కోట్ల విలువైన 936 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు నమోదయ్యాయి. ఇందులో యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) లావాదేవీల వాటా సంఖ్యా పరంగా 64 శాతం, విలువ పరంగా 50 శాతం ఉన్నట్లు వరల్డ్‌లైన్‌ డిజిటల్‌ చెల్లింపుల నివేదిక పేర్కొంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, మొబైల్‌ వాలెట్లు, ప్రీపెయిడ్‌ కార్డుల వంటి ప్రీపెయిడ్‌ చెల్లింపు విధానాల (పీపీఐ)ను ఇందులో కలిపారు.

* అధిక విలువ లావాదేవీలకు వినియోగదారులు క్రెడిట్‌ కార్డులనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. మొత్తం లావాదేవీల్లో క్రెడిట్‌ కార్డుల వాటా 7 శాతమే అయినా, విలువ పరంగా 26 శాతంగా ఉంది.  డెబిట్‌ కార్డుల లావాదేవీల వాటా 10 శాతంగా ఉండగా, విలువ పరంగా 18 శాతంగా నమోదైంది.

* 2021 మొదటి త్రైమాసికంతో పోలిస్తే యూపీఐ లావాదేవీలు పరిమాణం, విలువ వరుసగా 99 శాతం, 90 శాతం అధికమయ్యాయి.

* అగ్రగామి రెమిటెర్‌ బ్యాంకులుగా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ నిలిచాయి. బెనిఫిషియరీ బ్యాంకుల్లో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యెస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ముందు స్థానాల్లో నిలిచాయి.

* ఎక్కువ లావాదేవీలు జరిగిన యూపీఐ యాప్‌ల్లో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ యాప్‌, అమెజాన్‌ పే, యాక్సిస్‌ బ్యాంక్‌ యాప్‌లు ఉన్నాయి. అగ్రగామి పీఎస్‌పీ యూపీఐ సంస్థల్లో యెస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ నిలిచాయి. మొత్తం యూపీఐ లావాదేవీల్లో 94.8 శాతం ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలపైనే జరిగాయి.

* యూపీఐ లావాదేవీల పరిమాణంలో 60 శాతం, విలువలో 58 శాతం నిత్యావసర దుకాణాలు, రెస్టారెంట్లు, దుస్తులు, ఔషధాలు, హోటళ్లు, ఆభరణాలు, గృహోపకరణాలు, కిరాణా దుకాణాల్లో జరిగాయి. ఆన్‌లైన్‌ భాగంలో ఇ-కామర్స్‌, గేమింగ్‌, యుటిలిటీ, ఆర్థిక సేవల వాటా 85 శాతానికి పైగా ఉంది.

* డిజిటల్‌ లావాదేవీలు ఎక్కువగా జరిగిన మొదటి పది నగరాల్లో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి, పుణె, దిల్లీ, కోల్‌కతా, కోయంబత్తూర్‌, అహ్మదాబాద్‌, వడోదరా ఉన్నాయి. రాష్ట్రాల పరంగా చూస్తే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని