ద్రవ్యోల్బణంతో గిరాకీపై ప్రభావం

టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ తన వృద్ధికి ఊతమిచ్చే సరైన కొనుగోలు అవకాశాల కోసం చూస్తూనే ఉంటుందని కంపెనీ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. సంస్థ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌)లో వాటాదార్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ ‘కంపెనీ కొత్త విభాగాల్లోకి అడుగుపెట్టడం

Published : 28 Jun 2022 03:04 IST

టాటా కన్జూమర్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌

దిల్లీ: టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ తన వృద్ధికి ఊతమిచ్చే సరైన కొనుగోలు అవకాశాల కోసం చూస్తూనే ఉంటుందని కంపెనీ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. సంస్థ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌)లో వాటాదార్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ ‘కంపెనీ కొత్త విభాగాల్లోకి అడుగుపెట్టడం ద్వారా భవిష్యత్‌లో వృద్ధి అవకాశాలకు బలం చేకూరేలా చేస్తుంది. విస్తరణ అనేది కీలక వ్యూహమేన’ని టాటా సన్స్‌ ఛైర్మన్‌ కూడా అయిన చంద్రశేఖరన్‌ అన్నారు. ‘నీరు, ఆహారం, పానీయాల వంటి కొత్త విభాగాల్లోనూ సంస్థలను కొనుగోళ్లు చేసే అవకాశం ఉంద’ని అన్నారు. గతేడాది ఆరోగ్యకర అల్పాహారాలనందించే కొట్టారామ్‌ ఆగ్రో ఫుడ్స్‌ నుంచి ఒక విభాగాన్ని(సోల్‌ఫుల్‌) టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ కొనుగోలు చేస్తుంది. ‘టాటా స్మార్ట్‌ఫుడ్జ్‌ కొనుగోలు ద్వారా రెడీ-టు-ఈట్‌ విభాగంలో మా పోర్ట్‌ఫోలియోను విస్తరించాం. నారిష్‌కో, టాటా సంపన్న్‌, టాటా సోల్‌ఫుల్‌, టాటా క్యూలు కలిసి 52% వృద్ధి చెందాయి. మరిన్ని పెట్టుబడులు వీటిలో పెడతామ’ని ఆయన అన్నారు. 2022-23లో రూ.361 కోట్ల మూలధన వ్యయాలను చేస్తామని, అమెరికా, కెనడా, బ్రిటన్‌ వంటి అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి పెడతామన్నారు. ప్రస్తుత అనిశ్చితులు, సరఫరా వైపు సవాళ్లు, ముడి చమురు, ఇతర వస్తువుల ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోందని.. ఇది అన్ని విభాగాల్లోని గిరాకీపై ప్రభావం చూపొచ్చని అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని