ఎయిర్‌బస్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి రూ.43,000 కోట్ల ఆర్డరు!

త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌  నుంచి 5.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.43,000 కోట్ల) విలువైన విమానాల ఆర్డరు పొందడంలో ఎయిర్‌బస్‌ ఎస్‌ఈ ముందు వరుసలో ఉందని సమాచారం. ఈ అంశాలతో సంబంధమున్న

Published : 28 Jun 2022 03:04 IST

ముంబయి: త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌  నుంచి 5.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.43,000 కోట్ల) విలువైన విమానాల ఆర్డరు పొందడంలో ఎయిర్‌బస్‌ ఎస్‌ఈ ముందు వరుసలో ఉందని సమాచారం. ఈ అంశాలతో సంబంధమున్న వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ ఈ వివరాలు తెలిపింది. అయితే జెట్‌ ఎయిర్‌వేస్‌తో బోయింగ్‌, ఎంబ్రాయర్‌ కంపెనీలు కూడా చర్చల్లో ఉన్నాయని.. ఏ విమానాలు తీసుకోవాలనే విషయమై సంస్థ ఇంకా తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఆ వర్గాలు పేర్కొన్నారు. అధికారిక ధరల ప్రకారం జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్డరు ఇచ్చే విమానాల విలువ 5 బిలియన్‌ డాలర్లకు పైనే ఉంటుంది. ఇటువంటి పెద్ద లావాదేవీల్లో సాధారణంగానే విమాన తయారీ కంపెనీలు రాయితీలు ఇస్తుంటాయి. బోయింగ్‌, ఎయిర్‌బస్‌లు ఈ అంశంపై స్పందించలేదు. జెట్‌ ఎయిర్‌వేస్‌ గత నెలలోనే ఫ్లైయింగ్‌ లైసెన్సు పొందిన సంగతి తెలిసిందే. ‘లీజుదార్లు, ఓఈఎమ్‌లతో విమానాల కోసం తుది చర్చల్లో ఉన్నాం. ఎవరిని ఎంచుకోబోతున్నామన్నది నిర్ణయం తీసుకున్నాక వెల్లడిస్తామ’ని జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని