రూ.1000 లోపు హోటల్ గదులపైనా 12% జీఎస్టీ!
ప్రీ-ప్యాక్డ్, లేబుల్డ్ పన్నీర్, తేనెకు పన్ను
ఆమోదించిన జీఎస్టీ మండలి
దిల్లీ: కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లలో మార్పులకు జీఎస్టీ మండలి మంగళవారం ఆమోదం తెలిపింది. మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్, తేనె వంటి ప్రీ-ప్యాక్డ్, లేబుల్డ్ ఆహార వస్తువులపైనా జీఎస్టీ (వస్తు సేవల పన్ను) విధించనున్నారు. చెక్‌ల జారీకి బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలపైనా పన్ను వసూలు చేస్తారు. అంతరాష్ట్ర పరిధిలో పసిడి, విలువైన రాళ్లను రవాణా చేసేందుకు రాష్ట్రాలు ఇ-వే బిల్లు జారీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పన్ను ఆదాయాల్లో మరింత వాటాను రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో మండలి ఈ నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాల మంత్రుల కూడిన జీఎస్టీ మండలి సమావేశమైంది. జీఎస్టీ నమోదిత వ్యాపారాలకు నిబంధనలు, అధిక పన్ను చెల్లింపుదార్ల ఎగవేతల తనిఖీకి సంబంధించి మంత్రుల బృందం (జీఓఎం) నివేదికకు మండలి ఆమోద్రముద్ర వేసింది. 2022 జూన్ తర్వాతా రాష్ట్రాలకు పరిహారం చెల్లించడం కొనసాగించాల్సిందిగా విపక్ష పాలిత రాష్ట్రాలు కోరుతున్నాయి. దీంతో పాటు క్యాసినో, ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదనలపై బుధవారం చర్చించనున్నారు.
* హోటల్లో గది అద్దె రోజుకు రూ.1000 లోపు ఉంటే జీఎస్టీ మినహాయింపు ఉంది. ఈ స్థానంలో 12 శాతం పన్ను విధించాలన్న మంత్రుల బృందం ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.
* రోజుకు రూ.5000 పైబడితే.. రోగుల నుంచి వసూలు చేసే ఆసుపత్రి గది అద్దె (ఐసీయూ మినహాయించి)పై 5 శాతం జీఎస్టీ విధించనున్నారు.
* 10 గ్రాముల కంటే తక్కువ బరువు ఉన్న పోస్ట్‌కార్డులు, ఇన్లాండ్ లెటర్లు, బుక్ పోస్ట్, ఎన్వెలప్లను మినహాయించి ఇతర తపాలా సేవలపై పన్ను వేయనున్నారు. చెక్‌లు, లూజ్ లేదా ఇన్ బుక్ ఫామ్‌పై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి రావొచ్చు.
* పన్నుల హేతుబద్ధీకరణపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం మధ్యంతర నివేదికను మండలి అంగీకరించింది.
జీఎస్టీ పరిహారం కొనసాగించండి
ఈ నెల 30 తర్వాత కూడా జీఎస్టీ పరిహారాన్ని కొనసాగించాల్సిందిగా విపక్ష పార్టీలు పాలిత రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. ఆదాయ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. జీఎస్టీ ఆదాయం పంచుకునే విధానంలో మార్పులు లేదా పరిహారం చెల్లించడాన్ని మరో అయిదేళ్లు కొనసాగించాల్సిందిగా కోరాయి. జీఎస్టీ మండలి నిర్ణయాలకు రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రాలు ప్రస్తావించాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
UP: మహిళపై వేధింపులు.. పరారీలో ఉన్న భాజపా నేత అరెస్టు!
-
Politics News
Bihar politics: నీతీశ్‌పై మండిపడిన చిరాగ్.. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్
-
India News
PM Modi: ఆస్తులేవీ లేవు.. ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ప్రధాని!
-
Sports News
IND VS PAK: అత్యుత్సాహం వల్లే భారత్‌పై పాక్ ఓడిపోతుంది: ఆ దేశ క్రికెటర్
-
General News
Srisailam Dam: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయం 6గేట్లు ఎత్తివేత
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్‌కి ఇంటర్నెట్ షేక్
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- CWG 2022: 90.18 మీటర్ల రికార్డు త్రో.. అభినందించిన నీరజ్ చోప్రా
- ASIA CUP 2022: నేను సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఉంటే కచ్చితంగా అతడిని ఎంపిక చేస్తా: మాజీ సెలక్టర్