అంకుర విజయానికి ఆలోచనే కీలకం

పారిశ్రామికవేత్తలుగా మారాలనుకున్నప్పుడే.. నష్టం వచ్చినా భరించేందుకు సిద్ధంగా ఉండాలని సినీ నటుడు, ఇన్వెస్టర్‌ దగ్గుబాటి రానా అన్నారు. మంగళవారం టి-హబ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకుర సంస్థను ఏర్పాటు చేసే వారు

Published : 29 Jun 2022 03:07 IST

రానా దగ్గుబాటి

ఈనాడు, హైదరాబాద్‌: పారిశ్రామికవేత్తలుగా మారాలనుకున్నప్పుడే.. నష్టం వచ్చినా భరించేందుకు సిద్ధంగా ఉండాలని సినీ నటుడు, ఇన్వెస్టర్‌ దగ్గుబాటి రానా అన్నారు. మంగళవారం టి-హబ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకుర సంస్థను ఏర్పాటు చేసే వారు లోతైన ఆలోచనా విధానంతో ముందడుగు వేయాలని సూచించారు. ఈ సంస్థల విజయం ఆలోచన, ఆచరణపైనే ఆధారపడి ఉంటుందన్నారు. సినీ నటుడుగా కొనసాగుతూనే 15 ఏళ్లుగా తను వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్లాక్‌ చెయిన్‌, వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలను పరిశీలిస్తున్నానన్నారు. కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టినప్పుడు ఓపిక ముఖ్యమని, అదే సమయంలో మంచి బృందాన్ని తయారు చేసుకోవడం ద్వారా సగం విజయం సాధించినట్లవుతుందన్నారు. వేర్వేరు ఆలోచనలతో వచ్చిన అంకురాలు  ఒకచోట చేరినప్పుడు, ఒకరితో ఒకరు తమ అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నారు. దీనికి టి-హబ్‌లాంటి ఇంక్యుబేటర్లు ఎంతో తోడ్పడతాయని పేర్కొంటూ, దీని ప్రారంభం కోసం కేటీఆర్‌ చేసిన కృషిని అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని