ఏసీలు, ఎల్‌ఈడీ లైట్ల పీఎల్‌ఐ పథకంలోకి మరో 15 కంపెనీలు

ఎయిర్‌ కండీషనర్లు (ఏసీ), ఎల్‌ఈడీ లైట్ల వంటి వైట్‌ గూడ్స్‌ రంగానికి ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం కింద లబ్ధి పొందేందుకు మరో 15 కంపెనీలు ఎంపికయ్యాయి. వీటిలో అదానీ కాపర్‌ ట్యూబ్స్‌, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌, జిందాల్‌ పాలీ

Published : 29 Jun 2022 03:07 IST

దిల్లీ: ఎయిర్‌ కండీషనర్లు (ఏసీ), ఎల్‌ఈడీ లైట్ల వంటి వైట్‌ గూడ్స్‌ రంగానికి ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం కింద లబ్ధి పొందేందుకు మరో 15 కంపెనీలు ఎంపికయ్యాయి. వీటిలో అదానీ కాపర్‌ ట్యూబ్స్‌, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌, జిందాల్‌ పాలీ ఫిల్మ్స్‌, సహారా సెమీకండక్టర్స్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌, మిత్సుబిషి ఎలక్ట్రిక్‌ ఇండియా, జిందాల్‌ పాలీ ఫిల్మ్స్‌, సహస్ర సెమీ కండక్టర్స్‌ వంటి సంస్థలు తాజా జాబితాలో ఉన్నాయి. వీటి ద్వారా రూ.1,368 కోట్లపెట్టుబడులు రానున్నాయి. ఈ పథకం కింద 2021-22 నుంచి 2028-29 వరకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రూ.6,238 కోట్లు కేటాయించారు. గతేడాది దైకిన్‌, పానసోనిక్‌, సిస్కా, హావెల్స్‌ వంటి 46 కంపెనీలు ఈ పథకం తొలి దశ కింద ఎంపికయ్యాయి. అవి రూ.5,264 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. తదుపరి ఈ పథకంపై పలు కంపెనీలు ఆసక్తి కనబరచినందున, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది మార్చిలో మరోసారి దరఖాస్తులను ఆహ్వానించింది. రెండో దశలో 19 దరఖాస్తులు రాగా, అందులో 15కు ఆమోదం తెలిపినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాబోయే అయిదేళ్లలో ఈ పథకం కింద రూ.1,22,671 కోట్ల విలువైన ఏసీ, ఎల్‌ఈడీ లైట్ల విడిభాగాల ఉత్పత్తి జరుగుతుందన్నది మంత్రిత్వ శాఖ అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని