గ్లెన్‌మార్క్‌ ఫార్మా చేతికి అమెరికాలో వోకార్డ్‌ ఔషధాలు

గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌, యూఎస్‌ మార్కెట్లో వోకార్డ్‌ లిమిటెడ్‌కు చెందిన కొన్ని ఔషధాలను కొనుగోలు చేసింది. యూఎస్‌లోని తన అనుబంధ సంస్థ అయిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంక్‌., ద్వారా ఈ ఔషధాలు సొంతం చేసుకున్నట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా వెల్లడించింది.

Published : 29 Jun 2022 03:07 IST

దిల్లీ: గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌, యూఎస్‌ మార్కెట్లో వోకార్డ్‌ లిమిటెడ్‌కు చెందిన కొన్ని ఔషధాలను కొనుగోలు చేసింది. యూఎస్‌లోని తన అనుబంధ సంస్థ అయిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంక్‌., ద్వారా ఈ ఔషధాలు సొంతం చేసుకున్నట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా వెల్లడించింది. ఇందులో ఫమోటిడిన్‌ ట్యాబ్లెట్‌, సిట్రిజెన్‌ హైడ్రోక్లోరైడ్‌, లాన్సోప్రజోల్‌, ఓలోపటడిన్‌ హైడ్రోక్లోరైడ్‌ ఆప్తాల్మిక్‌ సొల్యూషన్‌ ఉన్నాయి. యూఎస్‌ మార్కెట్లో 175 ఔషధాలు విక్రయించడానికి గ్లెన్‌మార్క్‌ ఫార్మాకు అనుమతి ఉంది. దీనికి తోడు అవకాశం ఉన్నంత మేరకు ఔషధాల సంఖ్యను పెంచుకునేందుకు భాగస్వామ్యాలు, కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని