భారతీయ వైద్యులకు యూకేలో చదువుకునే అవకాశం

అపోలో హాస్పిటల్స్‌ గ్రూపునకు చెందిన అపోలో ఎడ్యుకేషన్‌ యూకే, అపోలో ఇంటర్నేషనల్‌ క్లినికల్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ (ఔసీఎఫ్‌పీ)- 2022 ను ఆవిష్కరించింది. ‘అపోలో ఇనీషియేటివ్‌’ కింద ఈ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ను చేపట్టారు. దీనికి మనదేశానికి చెందిన వైద్యులు దరఖాస్తు

Published : 29 Jun 2022 03:06 IST

అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు నుంచి ‘ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌’  

దిల్లీ: అపోలో హాస్పిటల్స్‌ గ్రూపునకు చెందిన అపోలో ఎడ్యుకేషన్‌ యూకే, అపోలో ఇంటర్నేషనల్‌ క్లినికల్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ (ఔసీఎఫ్‌పీ)- 2022 ను ఆవిష్కరించింది. ‘అపోలో ఇనీషియేటివ్‌’ కింద ఈ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ను చేపట్టారు. దీనికి మనదేశానికి చెందిన వైద్యులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఎస్‌/ఎండీ/డీఎన్‌బీ పూర్తిచేసిన వైద్యులు దీనికి అర్హులు. యూకేలోని ఎడ్జ్‌ హిల్‌ యూనివర్సిటీలో సర్జరీ అండ్‌ మెడిసిన్‌లో మూడేళ్ల మాస్టర్స్‌ డిగ్రీ చదివే అవకాశం లభిస్తుంది. గ్లోబల్‌ ట్రైనింగ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌- రైటింగ్టన్‌, విగన్‌ అండ్‌ లీహ్‌ టీచింగ్‌ హాస్పిటల్స్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌, ఎడ్డ్‌ హిల్‌ యూనివర్సిటీ-  యూకే, గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌ డెవలప్‌మెంట్‌ ఇనీషియేటివ్‌ సహకారంతో ఈ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు వెల్లడించింది. ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన వైద్యులు మొదటి ఏడాది మనదేశంలోని అపోలో హాస్పిటల్స్‌లో పనిచేయాలి. రెండు, మూడు సంవత్సరాల్లో యూకేలోని ఎన్‌హెచ్‌ఎస్‌ హాస్పిటల్స్‌లో చదువు- పని ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని