Published : 30 Jun 2022 02:14 IST

హైదరాబాద్‌ ఇళ్ల విక్రయాల్లో 21% వృద్ధి

దేశవ్యాప్తంగా ఐదు శాతమే
ఏప్రిల్‌-జూన్‌పై ప్రాప్‌ టైగర్‌ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ భయాలు తొలగి ఆర్థిక స్థిరత్వంపై భరోసా ఏర్పడటంతో, ఈ ఏడాది రెండో త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో దేశవ్యాప్తంగా ఇళ్ల విక్రయాలు పెరిగాయి. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌లలో అత్యధిక వృద్ధి నమోదైంది. ప్రాప్‌ టైగర్‌ వెల్లడించిన రియల్‌ ఇన్‌సైట్‌ రెసిడెన్షియల్‌ నివేదిక ప్రకారం దేశంలోని 8 నగరాల్లో జనవరి-మార్చిలో 70,620 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమైతే.. ఏప్రిల్‌-జూన్‌లో 5% అధికమై 74,330కు చేరాయి.

* హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాల్లో 21% వృద్ధి నమోదైంది. తొలి త్రైమాసికంలో 6560 యూనిట్లు విక్రయిస్తే.. రెండో త్రైమాసికంలో 7910 యూనిట్లు విక్రయించినట్లు వెల్లడించింది.

* అహ్మదాబాద్‌లో 5550 యూనిట్ల నుంచి 30 శాతం వృద్ధితో 7240కు చేరింది. దిల్లీ రాజధాని ప్రాంతం, చెన్నై, పుణెలలో ప్రతికూల వృద్ధి నమోదైంది.  బెంగళూరు, కోల్‌కతా, ముంబయిలలోనూ విక్రయాలు పెరిగాయి.

కొత్త ప్రాజెక్ట్‌లు..: కొత్త ప్రాజెక్టులు, ఇళ్ల సరఫరా ఏప్రిల్‌-జూన్‌లో కోల్‌కతాలో రెండింతలు పెరిగితే, హైదరాబాద్‌లో 13% వృద్దే కనిపించింది. సంఖ్యా పరంగా 14570 నుంచి 16,480 ఇళ్లకు పెరిగింది. దేశవ్యాప్తంగా సరఫరా 79,530 నుంచి 28% పెరిగి 1.02 లక్షలకు చేరింది.

* ప్రాజెక్ట్‌లోని ఇళ్లను పూర్తిగా అమ్మడానికి సగటున 34 నెలలు పడుతోంది. హైదరాబాద్‌లో ఇది 37 నెలలైతే, దిల్లీలో 65 నెలలుగా ఉంది.

* దేశంలోని 8 నగరాల్లో కలిపి 7.63 లక్షల ఇళ్లు అమ్ముడుపోకుండా ఉన్నాయి. ప్రాజెక్ట్‌ అనుమతి తీసుకున్న దశ నుంచే ఇన్వెంటరీగా పరిగణిస్తున్నారని.. ఇది సరికాదని బిల్డర్లు అంటున్నారు.


హైదరాబాద్‌లోనే చౌక

దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే ఇప్పటికీ హైదరాబాద్‌లోని ఇళ్ల ధరలే తక్కువని మెర్సర్స్‌ 2022 సర్వే తాజాగా వెల్లడించింది. జీవన వ్యయం, ఇళ్ల ధరలు రెండింటిని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం పుణె, కోల్‌కతాల కంటే హైదరాబాద్‌ ఖరీదైందని వెల్లడించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని