Published : 30 Jun 2022 02:13 IST

ఐఫోన్‌కు 15 ఏళ్లు

లీసెస్టర్‌: అమెరికా సాంకేతిక దిగ్గజం యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ను విడుదల చేసినపుడు, ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని భావించి ఉండకపోవచ్చు. 15 ఏళ్ల కిందట అంటే 2007 జూన్‌ 29న అమెరికాలో, మరో ఆరు దేశాల్లో అదే ఏడాది నవంబరులో విడుదలైన ఐఫోన్‌ అత్యధికుల ఆదరణ పొందింది. ఐఫోన్‌ను కలిగి ఉండడం హోదాకు చిహ్నంగా భావించేలా చేసింది. 21వ శతాబ్దంలో ప్రజలను అత్యంత ప్రభావితం చేసిన పరికరాల్లో ఒకటిగా నిలిచింది.

ఒక ఉత్పత్తిని అందరి దృష్టికీ తీసుకురావడం ఎలాగో 1970 దశకంలో మ్యాక్‌ కంప్యూటర్లను; 2011లో ఐపాడ్‌ను తీసుకొచ్చిన యాపిల్‌కు బాగా తెలుసు. పెద్ద తెరలున్న స్మార్ట్‌ఫోన్‌లు వస్తున్న 2007 ప్రాంతంలో విడుదలైన ఐఫోన్‌, చిన్న తెరతోనే అత్యధికులను ఆకట్టుకోవడమే అసలు ఆశ్చర్యం. ప్రారంభ ఐఫోన్‌లో వైఫై, 2జీ ఎడ్జ్‌ కనెక్టివిటీ మాత్రమే ఉండేవి. 4జీబీ /  8 జీబీ మెమొరీ మోడళ్లే వచ్చాయి. ఫోన్‌లోనే వందల కొద్దీ పాటలు, వీడియోలను నిల్వ చేసుకోవడమన్నది ఆ సమయంలో విప్లవంగా చెప్పవచ్చు. 2008  జులైలో ఐఫోన్‌ 3జీ వచ్చినపుడు డేటా స్పీడ్‌ బాగా పెరిగింది. 500 యాప్‌లను తీసుకొచ్చింది. తరచుగా కొత్త ఉత్పత్తులను తీసుకువస్తూ విజయానికి అర్థంగా యాపిల్‌ మారింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇవ్వడం; ఏటా కొత్త ఆవిష్కరణలు చేయడం ద్వారా తన వినియోగదార్లను పెంచుకోగలిగింది. పాత ఐఫోన్లను కుటుంబంలోని వారికే ఇచ్చి, కొత్త మోడల్‌ ఐఫోన్‌ కొనేలా యువతను, సంపాదనా పరులను ఆకర్షించగలిగింది. మొత్తంమీద అన్ని తరాల వారూ ఐఫోన్‌ వాడేలా చేసింది. గత 15 ఏళ్లలో పరిమాణం, ప్రాసెస్‌ వేగం, డేటా నిల్వ విషయాల్లో ఐఫోన్‌ సిరీస్‌ ఫోన్లు మెరుగుపడుతూనే ఉన్నాయి. 2013లో ఐఫోన్‌ 5ఎస్‌ టచ్‌ ఐడీతో వచ్చింది. వేలిముద్ర ద్వారా ఫోన్‌ను అన్‌లాక్‌ చేసే వీలుకల్పించింది. ఇక ఐఫోన్‌ 8లో ముఖాన్ని గుర్తించే ఫీచర్‌ తీసుకొచ్చింది. వీటిలో కొన్ని బలహీనతలున్నా.. భద్రతపరంగా ఇతర కంపెనీల ఫోన్ల కన్నా మెరుగే అనిపించింది. కెమేరా సాంకేతికతనూ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్లింది. 2 మెగాపిక్సల్‌ కెమేరా నుంచి 12 మెగాపిక్సల్‌ వరకు పెంచుకుంటూ వెళ్లింది.

ఇబ్బందులూ వచ్చాయ్‌: ఐఫోన్‌కు ఇబ్బందులేమీ ఎదురుకాకుండా పోలేదు. ఐఫోన్‌ 7ను 2016లో తీసుకొచ్చినపుడు, 3.5 ఎమ్‌ఎమ్‌ హెడ్‌ఫోన్‌ సాకెట్‌ విషయంలో ఎక్కువ మంది సంతోషంగా లేరు. మరో వైపు, ఛార్జర్లను మార్చడంతో పాత ఐఫోన్‌ ఛార్జర్లను కొత్త వాటికి వాడడం కుదరలేదు. ఇది ఇతర కంపెనీల మొబైల్‌లకూ వర్తిస్తుందనుకోండి. గత 15 ఏళ్ల తరహాలోనే ఏటా కొత్త మోడల్‌ ఆవిష్కరణలను యాపిల్‌ కొనసాగించనుంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్‌ 14 రావొచ్చన్న అంచనాలున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని