సూచీలకు స్వల్ప నష్టాలు..
అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యం
సమీక్ష
లాభాలతో ఆరంభమైన స్టాక్ మార్కెట్లు ఆఖరుకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల ప్రభావం ఇందుకు దోహదం చేసింది. ఆసియా, ఐరోపా మార్కెట్లను అంతర్జాతీయ మాంద్యం భయాలు వెంటాడుతుండటం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) అమ్మకాలను కొనసాగిస్తుండటమూ ప్రభావం చూపింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 5 పైసలు పెరిగి 78.98 వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 1.42 శాతం తగ్గి 114.84 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ సూచీలు డీలాపడగా.. చైనా షాంఘై లాభాల్లో ముగిసింది. ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.
ఆరంభం అదిరినా..: ఉదయం సెన్సెక్స్ 52,897.16 వద్ద సానుకూలంగానే ఆరంభమైంది. ఆ తర్వాత 350.57 పాయింట్ల లాభంతో 53,377.54 స్థాయి వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరింది. అక్కడ నుంచి అమ్మకాలు చోటుచేసుకోవడంతో క్రమక్రమంగా లాభాలు ఆవిరై సూచీ మధ్యాహ్నానికి నష్టాల్లోకి జారుకుంది. అయితే ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నప్పటికీ.. ఆఖర్లో మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ స్వల్పంగా 8.03 పాయింట్లు నష్టపోయి 53,018.94 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 18.85 పాయింట్లు కోల్పోయి 15,780.25 వద్ద స్థిరపడింది.
19 కంపెనీల షేర్లు దిగాలు..: సెన్సెక్స్ 30 షేర్లలో 11 రాణించగా.. 19 డీలాపడ్డాయి. అత్యధికంగా టెక్ మహీంద్రా షేరు 2.09% కుంగింది. బజాజ్ ఫైనాన్స్ (2%), బజాజ్ ఫిన్‌సర్వ్ (1.67%), టాటా స్టీల్ (1.65%), ఇండస్‌ఇండ్ బ్యాంక్ (1.61%), హెచ్‌సీఎల్ టెక్ (1.54%) షేర్లు కూడా నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా 1.74% లాభపడగా.. ఎస్‌బీఐ 1.38%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.13%, ఎన్‌టీపీసీ 0.88%, డాక్టర్ రెడ్డీస్ 0.84% మేర రాణించాయి. రంగాలవారీగా చూస్తే లోహ సూచీ 2.18%, వాహన 1.25%, బేసిక్ మెటీరియల్స్ 1.20%, స్థిరాస్తి 1.17%, ఐటీ 0.84% మేర డీలాపడ్డాయి. ఆర్థిక, యుటిలిటీస్, బ్యాంకింగ్, భారీ యంత్ర పరికరాల సూచీలు మెరిశాయి.
సమీక్ష
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
-
India News
PM Modi: అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచింది: ప్రధాని మోదీ
-
Ts-top-news News
TSRTC: 75 ఏళ్లు దాటిన వారికి నేడు ఉచిత ప్రయాణం
-
Crime News
Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Sushil Modi: ప్రధాని రేసులో నీతీశే కాదు.. మమత, కేసీఆర్ వంటి నేతలూ ఉన్నారు..!