అర్ధ దశాబ్దపు జీఎస్టీ
5 ఏళ్లు పూర్తి చేసుకున్న కొత్త పరోక్ష పన్ను విధానం
నెలకు రూ.1 లక్ష కోట్లకు పైగానే వసూళ్లు
దిల్లీ: దేశ చరిత్రలోనే అతి పెద్ద పన్నుల సంస్కరణ అయిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం నిన్నటితో (జూన్ 30) అర్ధ దశాబ్దాన్ని పూర్తి చేసుకుంది. బాలారిష్టాలతో మొదలైన దీని ప్రయాణం ఆ తర్వాత ఎన్నో మార్పు చేర్పులకు లోనైంది. ఈ కొత్త పరోక్ష పన్నుల విధానంపై ఆరంభంలో వ్యాపారులు, వినియోగదారుల్లో చాలా గందరగోళం నెలకొంది. పన్ను రిటర్న్‌ల దాఖలులో సమస్యలు, ఏ వస్తువుకు జీఎస్టీ వర్తిస్తుంది? వేటికి మినహాయింపు ఉంది? అనే విషయంలో అయోమయం సహా పలు రకాల ఇబ్బందులకు కేంద్ర బిందువు అయ్యింది. అయితే వీటిల్లో చాలా వరకు ప్రభుత్వం ప్రస్తుతం పరిష్కరించింది. రిటర్న్‌ల ప్రక్రియను సరళీకరించడంతో పాటు పలు రకాల ఉత్పత్తులకు జీఎస్టీ రేట్లను మార్పు చేసింది. జీఎస్టీపై అవగాహన పెంచే కార్యక్రమాలనూ చేపట్టింది. జీఎస్టీకి సంబంధించి కొన్ని సానుకూల అంశాలూ ఉన్నాయి. పన్ను పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకొని వచ్చేందుకు, పారదర్శకతకూ ఈ పన్నుల విధానం దోహదపడింది. పన్నుల ఎగవేతకు చాలా వరకు అడ్డుకట్ట పడింది. అంతేకాదు.. ప్రస్తుతం నెలకు రూ.1 లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూలు కావడం సర్వసాధారణమైంది. గత నాలుగు నెలలుగా (ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే) రూ.1.40 లక్షల కోట్ల జీఎస్టీ వసూలవుతూ వస్తోంది. జూన్‌లోనూ ఇదే ఒరవడి కొనసాగే అవకాశం ఉందని అంచనా.
అలా ఆరంభమై..: 2017 జులై 1న దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చింది. జీఎస్టీలో ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, వ్యాట్ సహా 17 రకాల పన్నులను, 13 సెస్సులను విలీనం చేశారు. దీని వల్ల ప్రజలకు పన్ను మీద పన్ను చెల్లించాల్సిన భారం తప్పినట్లయ్యింది. జీఎస్టీ విధానంలో 4 పన్ను రేట్ల శ్లాబులు (5%, 12%, 18% 28%) ఉన్నాయి. జీఎస్టీకి ముందు పన్ను మీద పన్ను చెల్లించాల్సి వస్తుండటంతో ఓ వినియోగదారు సగటున 31 శాతం వరకు పన్ను కట్టాల్సి వచ్చేదని అంచనా. ఈ నాలుగు పన్ను రేట్లు కాకుండా పసిడి, ఆభరణాలు, ఖరీదైన రాళ్లపై ప్రత్యేకంగా 3 శాతం; కోసిన, మెరుగుపెట్టిన వజ్రాలకు 1.5 శాతం మేర జీఎస్టీ రేటు విధిస్తున్నారు. విలాసవంత వస్తువులు, హానికారక ఉత్పత్తులపై అత్యధిక జీఎస్టీ రేటు 28 శాతంతో పాటు సెస్సు కూడా విధిస్తున్నారు. సెస్సు రూపంలో వసూలయ్యే డబ్బులను పరిహార నిధిలో జమ చేస్తున్నారు. జీఎస్టీ అమలు కారణంగా రాష్ట్రాలకు వాటిల్లుతున్న నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ పరిహార నిధిలో జమ చేసిన నిధులను వాడుతున్నారు. అయితే ఐదేళ్ల వరకు మాత్రమే రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. జూన్ 30తో ఈ గడువు కూడా ముగిసింది. కరోనా పరిణామాలతోనే రెండేళ్లు గడిచినందున పరిహారం చెల్లింపును కొనసాగించాలంటూ చాలా రాష్ట్రాలు అడుగుతున్నాయి. దీనిపై ఆగస్టు మొదటివారంలో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రాష్ట్రాలతో కలిసి ముందుకు..: జీఎస్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా లేదంటే మార్పు చేర్పులు చేయాలన్నా అది జీఎస్టీ మండలి చేతిలోనే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని ఈ జీఎస్టీ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఫలానా ప్రతిపాదనపై జీఎస్టీ మండలిలో విస్తృత చర్చ జరిపాకే నిర్ణయం వెలువడుతుంది. ఇప్పటివరకు 47 జీఎస్టీ మండలి సమావేశాలు జరిగాయి. జీఎస్టీ చట్టంలో సవరణలు సహా పలు రకాల చర్యలు, నిర్ణయాలకు ఈ సమావేశాలు వేదికయ్యాయి. తాజాగా జరిగిన సమావేశంలోనూ పలు వస్తువుల పన్ను రేట్లలో మార్పులు చేయడంతో పాటు రిటర్న్‌ల సరళీకరణకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ విధానానికి జీఎస్టీ నెట్వర్క్ వెన్నెముకలా పనిచేస్తోంది. పన్నుల ఎగవేత నియంత్రణకు, పన్నుల విధానంలో పారదర్శకతకు జీఎస్టీ నెట్వర్క్ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పొచ్చు. మరోవైపు పెట్రోలు, డీజిల్, విమాన ఇంధనం, విద్యుత్‌ను ఇంకా జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. వీటికి కూడా జీఎస్టీ వర్తింపజేస్తే.. వినియోగదారుకు పన్నుల మీద పన్ను కట్టే భారం తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ దిశగా ప్రభుత్వం ఎప్పుడు అడుగులు వేస్తుందో చూడాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
China-Taiwan ఉద్రిక్తతల వేళ.. తైవాన్ కీలక అధికారి అనుమానాస్పద మృతి
-
India News
Varun Gandhi: ఉచిత రేషన్ సరే.. ఆ రూ.10 లక్షల కోట్ల మాటేంటి..?
-
Movies News
Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
-
General News
Telangana News: గాంధీ సినిమా ఉచిత ప్రదర్శన.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు
-
Politics News
CM Kcr: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పంద్రాగస్టు కానుక
-
World News
నా మనవరాలు ఏం చేసిందని చంపేశారు..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Alibaba: 10 వేల మంది ఉద్యోగులకు అలీబాబా గుడ్‌బై.. 2016 తర్వాత తొలిసారి!
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
- Tattoos: టాటూలు వేసుకున్న ఇద్దరికి హెచ్ఐవీ పాజిటివ్!
- Rishi Sunak: ప్రధాని పదవికి నేనే బెస్ట్..!
- CWG 2022: రవి దహియా, వినేష్ పొగట్, నవీన్ పసిడి పట్టు.. రెజ్లింగ్‌లో స్వర్ణాల పంట
- IT Raids: సినీ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ సోదాలు.. రూ.200కోట్ల ‘నల్లధనం’ గుర్తింపు
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- ఈ బాధలు భరించలేకపోతున్నానంటూ అమెరికాలో ప్రవాస భారతీయురాలి ఆత్మహత్య
- INDw vs ENGw : క్రికెట్లో పతకం ఖాయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్ఇండియా
- Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికలో జగ్దీప్ ధన్‌ఖడ్ విజయం