మేలో మౌలిక రంగాల వృద్ధి 18.1%

 మౌలిక రంగాల వృద్ధి మే నెలలో 13 నెలల గరిష్ఠ స్థాయి అయిన 18.1 శాతానికి చేరింది. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 16.4 శాతంగా ఉంది. 8 మౌలిక రంగాలైన బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్‌, విద్యుత్‌ల వృద్ధి 2022 ఏప్రిల్‌లో 9.3 శాతంగా ఉంది.

Published : 01 Jul 2022 02:03 IST

దిల్లీ:  మౌలిక రంగాల వృద్ధి మే నెలలో 13 నెలల గరిష్ఠ స్థాయి అయిన 18.1 శాతానికి చేరింది. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 16.4 శాతంగా ఉంది. 8 మౌలిక రంగాలైన బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్‌, విద్యుత్‌ల వృద్ధి 2022 ఏప్రిల్‌లో 9.3 శాతంగా ఉంది. గత ఏడాది ఏప్రిల్‌లో ఇది 62.6 శాతం వృద్ధితో రికార్డు సృష్టించింది. మేలో బొగ్గు, ముడిచమురు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంట్‌, విద్యుత్‌ రంగాలు వరుసగా 25.1%, 4.6%, 16.7%, 22.8%, 26.3%, 22% మేర వృద్ధి చెందాయి. కాగా సహజ వాయువు, ఉక్కు రంగాలు 7%, 15% చొప్పున క్షీణించాయి. 2021 మేలో ఇవి 20.1%, 55.2% చొప్పున మందగించాయి. 2022-23 ఏప్రిల్‌-జూన్‌లో 8 కీలక రంగాల వృద్ధి 13.6 శాతం మేర క్షీణించింది. 2021-22 ఇదే సమయంలో 36.3 శాతం క్షీణత నమోదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని