ఒపెక్‌+ చమురు ఉత్పత్తి పెంపుతో పెట్రోలు ధరలు తగ్గకపోవచ్చు

ఒపెక్‌ చమురు కార్టెల్‌, అనుబంధ ఉత్పత్తి దేశాలు ముడి చమురు ఉత్పత్తిని పెంచాలని గురువారం నిర్ణయించాయి. అయితే ఈ పెంపుతో పంపుల వద్ద పెట్రోలు ధరలు తగ్గించడానికి, ఇంధన ద్రవ్యోల్బణంతో ఇబ్బందులకు గురవుతున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం

Published : 01 Jul 2022 02:02 IST

న్యూయార్క్‌: ఒపెక్‌ చమురు కార్టెల్‌, అనుబంధ ఉత్పత్తి దేశాలు ముడి చమురు ఉత్పత్తిని పెంచాలని గురువారం నిర్ణయించాయి. అయితే ఈ పెంపుతో పంపుల వద్ద పెట్రోలు ధరలు తగ్గించడానికి, ఇంధన ద్రవ్యోల్బణంతో ఇబ్బందులకు గురవుతున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలిగించేందుకు అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు నుంచి రోజుకు 6,48,000 బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి పెంచాలని 23 సభ్య దేశాల ఒపెక్‌+ నిర్ణయించినా, ప్రపంచ అవసరాలకు ఇది ఎంత మాత్రం సరిపోకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒపెక్‌+ గత సమావేశంలోనూ ఉత్పత్తి పెంపు దిశగా నిర్ణయం వెలువరించింది. రోజుకు 4,32,000 బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తిని పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని