Published : 02 Jul 2022 02:10 IST

పెరిగిన ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు

ముంబయి: ఆర్‌బీఐ రెపో రేటు పెంచడంతో బ్యాంకులూ అదే బాటలో రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే రెపో ఆధారిత వడ్డీ రేట్లను సవరించిన బ్యాంకులు.. ఇప్పుడు ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు)ను జులై 1 నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి.

* ఐసీఐసీఐ బ్యాంక్‌ తన ఎంసీఎల్‌ఆర్‌ను 20 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచింది. దీంతో ఈ బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ 7.50 - 7.75 శాతంగా ఉండనుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ జూన్‌లో ఎంసీఎల్‌ఆర్‌ను 30 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచింది.
* యెస్‌ బ్యాంక్‌ వివిధ కాలావధుల ఎంసీఎల్‌ఆర్‌ను 20-25 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచింది. కొత్త రేట్లు 7.60- 8.95 శాతం మధ్యలో ఉన్నాయి. గత నెలలో ఈ బ్యాంక్‌ ఈ వడ్డీ రేటును 15-25 బేసిస్‌ పాయింట్లు పెంచింది.
* బంధన్‌ బ్యాంక్‌ ఆరు నెలలు, ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ను 4 -9 బేసిస్‌ పాయింట్లు పెంచింది. మిగతా వ్యవధులకు ఈ వడ్డీ రేటును 11-42 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించింది. కొత్త రేట్లు 7.61%-9.85% మధ్య ఉండనున్నాయి.
* సీఎస్‌బీ బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ను 10-15 బేసిస్‌ పాయింట్లు పెంచింది. కొత్త వడ్డీ రేట్లు 7.80-9.70శాతం మధ్యలో ఉన్నాయి. బేస్‌ వడ్డీ రేటును 9.35 శాతం నుంచి  9.90 శాతానికి చేర్చింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని