కాగితపు స్ట్రాల బాటలో ఎఫ్‌ఎమ్‌సీజీ, అగ్రో ఫుడ్‌ కంపెనీలు

పెద్ద ఎఫ్‌ఎమ్‌సీజీ, అగ్రో-ఫుడ్‌ కంపెనీలు పళ్ల జ్యూస్‌లు, పాల ఉత్పత్తుల టెట్రా ప్యాక్‌ల్లో ప్లాస్టిక్‌ స్ట్రాలను తొలగిస్తున్నాయి. శుక్రవారం నుంచి ప్లాస్టిక్‌ స్ట్రాలపై నిషేధం అమల్లోకి రావడమే ఇందుకు కారణం. వీటి స్థానంలో పేపర్‌ ఆధారిత స్ట్రాలు, ఇతర ప్రత్యామ్నాయాలను కంపెనీలు

Published : 03 Jul 2022 02:56 IST

ప్లాస్టిక్‌ స్ట్రాలపై నిషేధ ఫలితం

దిల్లీ: పెద్ద ఎఫ్‌ఎమ్‌సీజీ, అగ్రో-ఫుడ్‌ కంపెనీలు పళ్ల జ్యూస్‌లు, పాల ఉత్పత్తుల టెట్రా ప్యాక్‌ల్లో ప్లాస్టిక్‌ స్ట్రాలను తొలగిస్తున్నాయి. శుక్రవారం నుంచి ప్లాస్టిక్‌ స్ట్రాలపై నిషేధం అమల్లోకి రావడమే ఇందుకు కారణం. వీటి స్థానంలో పేపర్‌ ఆధారిత స్ట్రాలు, ఇతర ప్రత్యామ్నాయాలను కంపెనీలు వినియోగిస్తున్నాయి. అగ్రగామి కంపెనీలు పార్లే అగ్రో, డాబర్‌, అమూల్‌, మదర్‌ డెయిరీ వంటి సంస్థలు ఇప్పటికే టెట్రా ప్యాక్‌ల్లో ప్లాస్టిక్‌ స్ట్రాలను ప్రత్యామ్నాయాలతో భర్తీ చేశాయి. స్టాకిస్ట్‌లు, రిటైలర్ల వద్ద మిగిలిన తమ ప్యాకెట్లకు, కాగితం స్ట్రాలు అందించేందుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది.

* కొత్త మార్గదర్శకాల ప్రకారం టెట్రా జ్యూస్‌ ప్యాక్‌ల్లో సమీకృత బయోడిగ్రేడబుల్‌ స్ట్రాలను ఇవ్వడం ప్రారంభించినట్లు ఫ్రూటీ, యాపీ ఫిజ్‌లను తయారు చేసే పార్లే అగ్రో పేర్కొంది. ఇప్పటికే పేపర్‌ ఆధారిత స్ట్రాలను దిగుమతి చేసుకున్నామని, త్వరలో పీఎల్‌ఏ ఆధారిత స్ట్రాలకు మారతామని కంపెనీ సీఈఓ షావునా చౌహాన్‌ పేర్కొన్నారు. జొన్న పిండి, పంచదార రసంతో పీఎల్‌ఏ స్ట్రాలను తయారుచేస్తారు.

* జులై 1 నుంచి తయారు చేసే జ్యూస్‌లు, డెయిరీ ప్యాక్‌ల కోసం దిగుమతి చేసుకున్న పేపర్‌ స్ట్రాలను వినియోగిస్తున్నట్లు మదర్‌ డెయిరీ ప్రకటించింది. డాబర్‌ కూడా కాగితం స్ట్రాల ఉత్పత్తి ప్రారంభించినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని