Published : 03 Jul 2022 02:56 IST

డి మార్ట్‌ ఆదాయం రూ.9,807 కోట్లు

దిల్లీ: డి-మార్ట్‌ విక్రయ కేంద్రాలు నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి స్టాండలోన్‌ పద్ధతిలో రూ.9,806.89 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కిందటేడాది ఇదే సమయంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన రూ.5,031.75 కోట్లతో పోలిస్తే ఆదాయం సుమారు రెండింతలైందని ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమాచారం ఇచ్చింది. ఆ సమయంలో కొవిడ్‌-19 రెండో దశ కారణంగా తక్కువ ప్రాతిపదిక ప్రభావం కూడా ఈ సారి ఆదాయంలో వృద్ధికి దోహదం చేసిందని పేర్కొంది. 2022 జూన్‌ 30 నాటికి కంపెనీ నిర్వహిస్తున్న మొత్తం విక్రయ కేంద్రాల సంఖ్య 294గా నమోదైంది. 2020-21 ఏప్రిల్‌- జూన్‌లో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ స్టాండలోన్‌ ఆదాయం రూ.3,833.23 కోట్లు కాగా.. 2019-20లో రూ.5,780.53 కోట్లుగా ఉంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని