ఇ ఫైలింగ్‌ పోర్టల్‌లో ఇబ్బందులు

కొత్త ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ను తీసుకొచ్చి ఏడాది పూర్తయినా ఇంకా ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. పన్ను చెల్లింపుదార్లు ఈ పోర్టల్‌ను యాక్సెస్‌ చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపై సాఫ్ట్‌వేర్‌ అందిస్తున్న ఇన్ఫోసిస్‌ తగిన చర్యలు తీసుకుంటోందని ఆదాయపు పన్ను

Published : 03 Jul 2022 02:56 IST

దిల్లీ: కొత్త ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ను తీసుకొచ్చి ఏడాది పూర్తయినా ఇంకా ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. పన్ను చెల్లింపుదార్లు ఈ పోర్టల్‌ను యాక్సెస్‌ చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపై సాఫ్ట్‌వేర్‌ అందిస్తున్న ఇన్ఫోసిస్‌ తగిన చర్యలు తీసుకుంటోందని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లో పన్ను చెల్లింపుదార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఐటీ విభాగం పేర్కొంది. దీన్ని ఇన్ఫోసిస్‌ దృష్టికి తీసుకెళ్లగా పోర్టల్‌లో ట్రాఫిక్‌ అసాధారణంగా ఉందని, దీన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరణ ఇచ్చిందని ఐటీ విభాగం ట్వీట్‌ చేసింది. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.164.5 కోట్లు ఇన్ఫోసిస్‌కు చెల్లించింది. 2021 జూన్‌ 7 నుంచి కొత్త పోర్టల్‌ ప్రారంభమైంది. అప్పట్లోనూ పోర్టల్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నామని పన్ను చెల్లింపుదార్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు