టైమెక్స్‌ గ్రూప్‌ నుంచి అడిడాస్‌ వాచీలు

టైమెక్స్‌ గ్రూప్‌ ఇండియా త్వరలోనే అడిడాస్‌ ఒరిజినల్‌ వాచీలను, జర్మనీ విలాస ఫ్యాషన్‌ హౌస్‌ ఫిలిప్‌ ప్లీన్‌ ఉత్పత్తుల్ని దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు ఆ కంపెనీ తాజా వార్షిక నివేదిక వెల్లడించింది. క్రిస్టల్స్‌, స్టడ్స్‌, మల్టీకలర్‌ ప్లేటింగ్‌, మిలిటరీ పాటర్న్స్‌, విలువైన,

Published : 03 Jul 2022 02:56 IST

దిల్లీ: టైమెక్స్‌ గ్రూప్‌ ఇండియా త్వరలోనే అడిడాస్‌ ఒరిజినల్‌ వాచీలను, జర్మనీ విలాస ఫ్యాషన్‌ హౌస్‌ ఫిలిప్‌ ప్లీన్‌ ఉత్పత్తుల్ని దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు ఆ కంపెనీ తాజా వార్షిక నివేదిక వెల్లడించింది. క్రిస్టల్స్‌, స్టడ్స్‌, మల్టీకలర్‌ ప్లేటింగ్‌, మిలిటరీ పాటర్న్స్‌, విలువైన, శుద్ధి చేసిన మెటీరియల్స్‌ కాంబినేషన్లకు ఫిలిప్‌ ప్లీన్‌ బ్రాండ్‌ పేరుగాంచింది. టైమెక్స్‌ గ్రూప్‌, స్పోర్టింగ్‌ వస్తువుల పరిశ్రమలో అగ్రగామి సంస్థగా ఉన్న అడిడాస్‌లు గత ఏడాది అంతర్జాతీయ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ప్రీమియం ఫ్యాషన్‌, విలాస వస్తువులకు భారతీయ విపణిలో ఉన్నత మధ్య ఆదాయ వర్గాల నుంచి గిరాకీ బాగుందని టైమెక్స్‌ గ్రూప్‌ పేర్కొంది. వారి అభిరుచులకు అనుగుణంగా అంతర్జాతీయ లైఫ్‌స్టైల్‌, ఫ్యాషన్‌ బ్రాండ్లను భారత్‌లో విడుదల చేయడం ద్వారా తమ బ్రాండ్‌ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసుకుంటామని టైమెక్స్‌ వెల్లడించింది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ కార్యకలాపాల ఆదాయం రూ.265.54 కోట్లుగా నమోదైందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని