సహజవాయువు అమ్మొచ్చు!

పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.52,510 కంటే పైన కదలాడకుంటే.. ప్రతికూల ధోరణికి ఆస్కారం ఉంటుంది. తక్కువ నష్టభయంతో ట్రేడ్‌ చేసే వాళ్లు    రూ.52,250 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.51,085; రూ.50,909 లక్ష్యాలతో రూ.51,191; రూ.50,911 దిగువన కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయడం మంచి

Published : 04 Jul 2022 04:36 IST

కమొడిటీస్‌

ఈ వారం

బంగారం

సిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.52,510 కంటే పైన కదలాడకుంటే.. ప్రతికూల ధోరణికి ఆస్కారం ఉంటుంది. తక్కువ నష్టభయంతో ట్రేడ్‌ చేసే వాళ్లు    రూ.52,250 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.51,085; రూ.50,909 లక్ష్యాలతో రూ.51,191; రూ.50,911 దిగువన కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే. అమెరికా విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాలు, ఐరోపా కేంద్ర బ్యాంక్‌ వ్యాఖ్యలు, డాలరు కదలికలు పసిడి కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేస్తాయి.

* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ జులై కాంట్రాక్టు రూ.14,273 కంటే దిగువన ట్రేడయితే రూ.14,207; రూ.14,108 వరకు అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు.


వెండి

వెండి సెప్టెంబరు కాంట్రాక్టు కిందకు వస్తే రూ.56,688 వద్ద మద్దతు లభించవచ్చు. ఇంకా పడిపోతే రూ.55,194కు చేరొచ్చు. ఒకవేళ పైకి వెళితే రూ.60,524 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.62,887; రూ.63,635 వరకు రాణించొచ్చు.


ప్రాథమిక లోహాలు

* రాగి జులై కాంట్రాక్టుకు రూ.651 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.693 లక్ష్యంతో రూ.658 సమీపంలో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.

* సీసం జులై కాంట్రాక్టు రూ.172.45 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే సానుకూలతకు అవకాశం ఉంటుంది. అందువల్ల రూ.168.65 వద్ద స్టాప్‌లాస్‌ను పరిగణిస్తూ కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదే.

* జింక్‌ జులై కాంట్రాక్టును రూ.275 దిగువన షార్ట్‌ సెల్‌ చేయొచ్చు. అయితే రూ.291.65 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

* అల్యూమినియం జులై కాంట్రాక్టు రూ.205 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే కొనుగోళ్ల మద్దతు లభించొచ్చు. ఈ స్థాయి వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, కొనుగోళ్లకు మొగ్గు చూపడం మేలే.


  ఇంధన రంగం

* ముడి చమురు జులై కాంట్రాక్టు రూ.8,808 కంటే పైన కదలాడితే రూ.8,978; రూ.9,171 వరకు పెరిగే అవకాశం ఉంది.

* సహజ వాయువు జులై కాంట్రాక్టుకు రూ.576 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.552- 554 దిగువన షార్ట్‌ సెల్‌ చేయడం మంచి వ్యూహమే అవుతుంది.


  వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు జులై కాంట్రాక్టు రూ.7,609 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే రూ.7,976 వరకు పెరగొచ్చు.

* జీలకర్ర జులై కాంట్రాక్టు రూ.21,813 కంటే పైన కదలాడితే మరింతగా రాణించొచ్చు. తక్కువ నష్ట భయంతో ట్రేడ్‌ చేసే వాళ్లు రూ.21,386 ఎగువన షార్ట్‌ సెల్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం మేలు.

* ధనియాలు జులై కాంట్రాక్టుకు అధిక స్థాయుల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చు. రూ.11,196 సమీపంలో మద్దతు లభించొచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.11,008కి పడిపోవచ్చు. ఒకవేళ పైకి వెళితే రూ.11,500 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని కూడా అధిగమిస్తే రూ.11,619 వరకు కాంట్రాక్టు వెళుతుందని భావించవచ్చు.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని