కేర్‌ హాస్పిటల్స్‌ చేతికి సీహెచ్‌ఎల్‌ ఆసుపత్రి

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కేర్‌ హాస్పిటల్స్‌ ఇండోర్‌లోని సీహెచ్‌ఎల్‌ ఆసుపత్రిని స్వాధీనం చేసుకుంది. ప్రైవేటు ఈక్విటీ ఫండ్‌ టీపీజీ పెట్టుబడులున్న కేర్‌ హాస్పిటల్స్‌.. ఈ కొనుగోలు కోసం రూ.350 - 400 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న

Published : 05 Jul 2022 02:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కేర్‌ హాస్పిటల్స్‌ ఇండోర్‌లోని సీహెచ్‌ఎల్‌ ఆసుపత్రిని స్వాధీనం చేసుకుంది. ప్రైవేటు ఈక్విటీ ఫండ్‌ టీపీజీ పెట్టుబడులున్న కేర్‌ హాస్పిటల్స్‌.. ఈ కొనుగోలు కోసం రూ.350 - 400 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్‌లో మొదటి కార్పొరేట్‌ ఆసుపత్రి కన్వీనియెంట్‌ హాస్పిటల్స్‌ లిమిటెడ్‌ (సీహెచ్‌ఎల్‌)కు కార్డియాలజీ, న్యూరోసైన్సెస్‌ విభాగాల్లో ఎంతో పేరుంది. 2001లో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రికి 250 పడకల సామర్థ్యం ఉంది. దీనికి మరో 150 పడకలను జత చేయబోతున్నట్లు కేర్‌ తెలిపింది. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలో పేరున్న కేర్‌ హాస్పిటల్స్‌ 1997లో హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభమైంది. తొలుత 100 పడకల ఆసుపత్రిని స్థాపించగా, ఇప్పుడు 6 రాష్ట్రాల్లో 15 ఆసుపత్రులను సంస్థ నిర్వహిస్తోంది. మొత్తం 2,400 పడకలతో 30 క్లినికల్‌ ప్రత్యేకతలతో కొనసాగుతోంది. తాజా భాగస్వామ్యంతో కేర్‌ ఆసుపత్రి కొత్త ప్రాంతానికి విస్తరించేందుకు వీలయ్యిందని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జస్దీప్‌ సింగ్‌ అన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ తాము సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఈ నగరాలు వైద్య రంగంలో మరింత వృద్ధి సాధించే అవకాశాలున్నాయని కేర్‌ హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ విశాల్‌ బాలి అన్నారు. తాము మరిన్ని నగరాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని