నిపుణులను కాపాడుకోవడమే సవాలు
కంపెనీల పరిస్థితులపై సర్వే
ముంబయి: కొవిడ్ పరిణామాల తరవాత, నైపుణ్యం ఉన్న వారిని ఆకర్షించడం; వారిని అట్టేపెట్టిఉంచుకోవడం కంపెనీలకు అతిపెద్ద సవాలుగా మారిందని ఓ సర్వే వెల్లడించింది. ఈ ఏడాదీ నిపుణులను కాపాడుకోవడమే సవాలుగా ఉందని 78% సంస్థలు అభిప్రాయపడ్డాయని డబ్ల్యూటీడబ్ల్యూ(విలీస్ టవర్స్ వాట్సన్) నిర్వహించిన ‘రీఇమాజినింగ్ వర్క్ అండ్ రివార్డ్స్ సర్వే’ తేల్చింది. ఐటీ, టెలికాం, తయారీ, సాధారణ సేవలు, ఆర్థిక సేవలు, ఇంధన-యుటిలిటీ, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లోని 51 కంపెనీలు, 7,23,000 ఉద్యోగుల నుంచి సేకరించిన సమాచారంతో నివేదికను సంస్థ రూపొందించింది. దీని ప్రకారం..
* రెండేళ్లుగా దేశంలోని పలు సంస్థలు ఇబ్బందులు పడ్డాయి. నైపుణ్యం ఉన్న వారి వలసలను ఎదుర్కొంటున్నట్లు 78% కంపెనీలు పేర్కొన్నాయి. ఉద్యోగులను అట్టేపెట్టిఉంచుకోవడంలో ఒత్తిడి ఎదుర్కొన్నట్లు 64% సంస్థలు చెప్పాయి.
* 2020లో మాత్రం ఉద్యోగులను ఆకర్షించడం (29%), అట్టేపెట్టిఉంచుకోవడం (26%) సమస్య అని కొద్ది కంపెనీలే పేర్కొనగా.. 2021 ద్వితీయార్థానికి వచ్చేసరికి ఈ గణాంకాలు వరుసగా 68%, 73 శాతానికి చేరాయి.
* 2022లో నిపుణులను అట్టేపెట్టిఉంచుకోవడానికి కష్టపడుతున్న కంపెనీల సంఖ్య 64 శాతానికి పరిమితమైంది. కావాల్సిన నైపుణ్యాలున్న వారిని ఆకర్షించడం సమస్యగా మారిన సంస్థల సంఖ్య 78 శాతానికి పెరిగింది.
* డిజిటల్ అనుభవం ఉన్న సిబ్బందిని ఆకర్షించడం, అట్టేపెట్టిఉంచుకోవడం అనే సవాళ్లు ఎదురైనట్లు 85 శాతం సంస్థలు పేర్కొన్నాయి. విక్రయాల విభాగంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు 74% కంపెనీలన్నాయి.
* పనిప్రదేశానికి సిబ్బంది తిరిగి వచ్చే విషయంలో; కరోనా సంబంధిత విధానాలకు ముగింపు పలికే విషయంలో ఇంకా వెనకబడే ఉన్నట్లు 54% సంస్థలు పేర్కొన్నాయి. ఈ విషయంలో 2023 లేదా ఆ తర్వాతే సాధారణ పరిస్థితులు కనిపించొచ్చని 12 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
-
World News
Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
Viral-videos News
Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!
-
Movies News
Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!
- Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!