చమురు పన్నుతో కేంద్రానికి రూ.94,800 కోట్లు

‘దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి, పెట్రోల్‌-డీజిల్‌- విమాన ఇంధన ఎగుమతులపై పన్ను విధించడం వల్ల కేంద్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 12 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.94,800 కోట్లు) ఆదాయం లభించనుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌), ఓఎన్‌జీసీ వంటి

Published : 06 Jul 2022 03:43 IST

ఆర్‌ఐఎల్‌, ఓఎన్‌జీసీ లాభాలకు గండి

మార్జిన్లకు ఢోకా లేదు

మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌

దిల్లీ: ‘దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి, పెట్రోల్‌-డీజిల్‌- విమాన ఇంధన ఎగుమతులపై పన్ను విధించడం వల్ల కేంద్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 12 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.94,800 కోట్లు) ఆదాయం లభించనుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌), ఓఎన్‌జీసీ వంటి కంపెనీల లాభాలు తగ్గనున్నాయని’ అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పేర్కొంది. ఇంకా ఏమంటోందంటే..

* 2021-22లో నమోదైన ముడి చమురు ఉత్పత్తి, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల ఆధారంగా లెక్కవేస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 బి. డాలర్ల ఆదాయాన్ని ప్రభుత్వం పొందగలదని అంచనా వేస్తున్నాం.

* మే ఆఖరులో పెట్రోలు, డీజిల్‌ ఎక్సైజ్‌ సుంకంలో విధించిన కోత వల్ల ఏర్పడ్డ ఆదాయ నష్టాన్ని ఇందువల్ల తట్టుకోవచ్చు. ద్రవ్య ఒత్తిళ్ల నుంచీ ఉపశమనం కల్పించవచ్చు.

* ఈ చర్య తాత్కాలికమేనని అంచనా. ద్రవ్యోల్బణం, విదేశీ మారకం, కరెన్సీ క్షీణత వంటి పలు మార్కెట్‌ పరిస్థితులను బట్టి సర్దుబాటు చేసే అవకాశం ఉంది.

* ఇంధన ఉత్పత్తులపై అధిక ఎగుమతి సుంకాల వల్ల ఎగుమతులు తగ్గవచ్చు. పసిడి దిగుమతులపై అధిక కస్టమ్స్‌ సుంకం విధించినందున, కరెంట్‌ ఖాతా లోటు పెరగడం అదుపులో ఉండొచ్చు.

* రూపాయి బలహీనతలున్నా.. విదేశీ రుణాల చెల్లింపులో ఇబ్బందులు వచ్చినా భారత్‌కున్న భారీ విదేశీ మారకపు నిల్వలు పరిష్కారం చూపుతాయి.

* ఎగుమతి సుంకాల వల్ల ఆర్‌ఐఎల్‌ పెట్రో ఎగుమతులపై కాస్త ప్రభావం పడొచ్చు. అయితే ఆర్‌ఐఎల్‌ / ఓఎన్‌జీసీ రుణ నాణ్యతకు ఢోకా ఉండదు. ఓఎన్‌జీసీ మార్జిన్లు కాస్త తగ్గొచ్చు. అయితే కంపెనీ ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉండడం, అధిక ముడి చమురు ధర వల్ల పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని