ప్రయాణికుల వాహన విక్రయాల్లో 40% వృద్ధి

జూన్‌లో దేశీయ ప్రయాణికుల వాహన రిటైల్‌ విక్రయాలు 40% పెరిగాయి. చిప్‌ సరఫరాలు మెరుగుపడటంతో పాటు ఎస్‌యూవీలకు గిరాకీ కొనసాగిందని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. 2022 జూన్‌లో దేశీయంగా ప్రయాణికుల వాహన రిజిస్ట్రేషన్‌లు 2,60,683గా నమోదయ్యాయి.

Published : 06 Jul 2022 03:43 IST

జూన్‌లో మెరుగుపడిన చిప్‌ సరఫరా: ఫాడా  

దిల్లీ: జూన్‌లో దేశీయ ప్రయాణికుల వాహన రిటైల్‌ విక్రయాలు 40% పెరిగాయి. చిప్‌ సరఫరాలు మెరుగుపడటంతో పాటు ఎస్‌యూవీలకు గిరాకీ కొనసాగిందని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. 2022 జూన్‌లో దేశీయంగా ప్రయాణికుల వాహన రిజిస్ట్రేషన్‌లు 2,60,683గా నమోదయ్యాయి. 2021 జూన్‌లో నమోదైన 1,85,998తో పోలిస్తే ఈసారి 40% అధిక రిజిస్ట్రేషన్లు జరిగాయి.  అన్ని విభాగాల్లో కలిసి వాహన రిటైల్‌ విక్రయాలు 2021 జూన్‌తో పోలిస్తే 27 శాతం పెరిగాయి. కొవిడ్‌ పరిణామాల ముందు నాటి 2019 జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో మొత్తం అమ్మకాలు 9 శాతం తక్కువే. ‘చిప్‌ లభ్యత మెరుగుపడటంతో కంపెనీల నుంచి వాహన సరఫరాలు పెరిగాయి. అయితే ఎస్‌యూవీ, కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగాల్లో నిరీక్షణ కాలం ఇంకా అధికంగానే ఉంద’ని ఫాడా అధ్యక్షుడు వింకేశ్‌ గులాటీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని