జీవితాంతం పింఛను వచ్చేలా...

పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం రావాలని భావించే వారిని లక్ష్యంగా చేసుకొని బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్తగా పింఛను పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘బజాజ్‌ అలయంజ్‌ గ్యారంటీడ్‌ పెన్షన్‌ గోల్‌’...

Published : 05 Mar 2021 01:13 IST

దవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం రావాలని భావించే వారిని లక్ష్యంగా చేసుకొని బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్తగా పింఛను పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘బజాజ్‌ అలయంజ్‌ గ్యారంటీడ్‌ పెన్షన్‌ గోల్‌’ అనే పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఇది రెండు రకాలుగా అందుబాటులో ఉంది. డిఫర్డ్‌ యాన్యుటీ అంటే.. క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించి, నిర్ణీత కాలం తర్వాత పింఛను తీసుకోవచ్చు. ఇమ్మీడియట్‌ యాన్యుటీలో.. ప్రీమియం మొత్తం చెల్లించిన వెంటనే పింఛను ప్రారంభమవుతుంది. జీవితాంతం పింఛను ఇవ్వడంతోపాటు, యాన్యుటీదారుడు మరణించిన తర్వాత పెట్టుబడి మొత్తాన్ని నామినీకి తిరిగి ఇస్తుంది. లేదా జీవిత భాగస్వామికీ పింఛను వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. డిఫర్డ్‌ యాన్యుటీని ఎంచుకున్నప్పుడు ప్రీమియం చెల్లింపు పూర్తయిన తర్వాత ఎంత పింఛను వస్తుందనేది ముందుగానే నిర్ణయిస్తారు. ఏక ప్రీమియంతోపాటు, 5 నుంచి 10 ఏళ్ల కాలం పాటు ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. మొత్తం 8 రకాలుగా పింఛను వచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇమ్మీడియట్‌ యాన్యుటీ ఎంచుకున్న 50 ఏళ్ల వ్యక్తి రూ.50లక్షలు ప్రీమియం చెల్లిస్తే.. నెలకు రూ.26,840 వరకూ అందుతాయి. ఏడాదికి రూ.3,35,500 చెల్లిస్తారు. అదే 55 ఏళ్ల వ్యక్తికి అయితే.. నెలకు రూ.28,512, ఏడాదికి రూ.3,56,400 పింఛను లభిస్తుంది. డిఫర్డ్‌ యాన్యుటీలో సింగిల్‌ ప్రీమియం రూ.50లక్షలు చెల్లించి, ఐదేళ్ల తర్వాత పింఛను తీసుకుంటే.. రూ.32,544 వచ్చేందుకు అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని