పర్యావరణానికి మేలుచేసే సంస్థల్లో...

పర్యావరణానికి హాని చేయని వ్యాపారాలు నిర్వహించే కంపెనీలపై పెట్టుబడులు పెట్టే ‘ఈఎస్‌జీ ఇన్వెస్ట్‌మెంట్‌’ ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇటువంటి కంపెనీలను గుర్తించటం, అందులో దేనిపై పెట్టుబడి పెట్టవచ్చు..?

Updated : 12 Mar 2021 01:15 IST

ర్యావరణానికి హాని చేయని వ్యాపారాలు నిర్వహించే కంపెనీలపై పెట్టుబడులు పెట్టే ‘ఈఎస్‌జీ ఇన్వెస్ట్‌మెంట్‌’ ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇటువంటి కంపెనీలను గుర్తించటం, అందులో దేనిపై పెట్టుబడి పెట్టవచ్చు..? అనేది నిర్ణయించుకోవడం కష్టసాధ్యం  అనిపించిన మదుపరుల కోసం ఒక కొత్త పథకం అందుబాటులోకి వచ్చింది.  
అదే ‘హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్‌ ఈక్విటీ క్లైమేట్‌ ఛేంజ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’. హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌- గ్లోబల్‌ ఈక్విటీ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఇఎచ్‌జీఈసీసీ)లో మదుపు చేసి, మదుపరులకు దీర్ఘకాలిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో ఈ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ను (ఎఫ్‌ఓఎఫ్‌) హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది.
ఈ ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 17. వచ్చిన సొమ్ములో కొంతమొత్తాన్ని మనీ మార్కెట్‌ పత్రాలు/ ఓవర్‌నైట్‌- లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లోనూ పెట్టుబడి పెట్టేందుకు వీలుంది. పునరుత్పాదక ఇంధన వనరులు, హరిత భవనాల నిర్మాణం, కాలుష్యం- వ్యర్థాల నివారణ, నిర్వహణ, నీటి వనరుల సద్వినియోగం, కాలుష్య రహిత రవాణా కార్యకలాపాలు... తదతర విభాగాల్లోని వ్యాపార సంస్థలను ఎంపిక చేసి వాటిపై పెట్టుబడి పెట్టే హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్‌ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇది మదుపు చేస్తుంది. దీనికి కపిల్‌ పంజాబి, ప్రియాంకర్‌ సర్కార్‌ ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని