హెచ్చుతగ్గులు ఇష్టపడని వారి కోసం..

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని తీసుకువచ్చింది ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ లో వోల్‌ 30 ఈటీఎఫ్‌ ఎఫ్‌ఓఎఫ్‌’ అనే ఈ

Published : 02 Apr 2021 00:36 IST

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని తీసుకువచ్చింది ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ లో వోల్‌ 30 ఈటీఎఫ్‌ ఎఫ్‌ఓఎఫ్‌’ అనే ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ ముగింపు తేదీ ఈ నెల 6. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ‘నిఫ్టీ 100 లో వోలటైలిటీ 30 ఇండెక్స్‌’తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. ఈ పథకం కింద సమీకరించిన నిధులను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ లో వోల్‌ 30 ఈటీఎఫ్‌ ఫండ్‌లో పెట్టుబడి పెడతారు. నిఫ్టీ 100 ఇండెక్స్‌ నుంచి ఎంచుకున్న, షేర్‌ ధర పరంగా తక్కువ హెచ్చుతగ్గులకు లోనయ్యే కంపెనీలు ఇందులో ఉంటాయి. ఒక్కో స్టాక్‌పై పెట్టుబడి 3 శాతానికి మించటానికి వీల్లేదు. ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌, పర్సనల్‌ కేర్‌, సిమెంటు రంగాలకు చెందిన కంపెనీలపై అధికంగా పెట్టుబడులు పెడతారు. మూడు నెలలకోసారి సూచీల్లో మార్పులు- చేర్పులకు అనుగుణంగా ఈ ఫండ్‌ పెట్టుబడులు కూడా మారతాయి. పెట్టుబడుల విలువలో తక్కువ హెచ్చుతగ్గులు ఉంటూ, దీర్ఘకాలంలో అధిక లాభాల ఆర్జనకు ఈ పథకం వీలు కల్పిస్తుందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది. గత అయిదేళ్ల కాలంలో నిఫ్టీ 100 లో వోలటైలిటీ 30 ఇండెక్స్‌ నుంచి 12- 16 శాతం సీఏజీఆర్‌ (వార్షిక సగటు వృద్ధి రేటు) నమోదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని