Updated : 09 Apr 2021 06:38 IST

స్పల్పకాలిక పెట్టుబడికి..

ట్రస్ట్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఒక ఓపెన్‌ ఎండెడ్‌ లిక్విడ్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ప్రధానంగా రుణ పత్రాలు, మనీ మార్కెట్‌ పత్రాల్లో ఈ ఫండ్‌ పెట్టుబడులు పెడుతుంది.
‘ట్రస్ట్‌ ఎంఎఫ్‌ లిక్విడ్‌ ఫండ్‌’ అనే పేరుతో ఆవిష్కరించిన ఈ ఫండ్‌ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఈ నెల 22న ముగుస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓ ద్వారా ఈ ఫండ్‌ కింద రూ.1,000 కోట్ల నుంచి రూ.2,000 కోట్లు సమీకరించాలని ట్రస్ట్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ భావిస్తోంది. ఈ సంస్థ నుంచి వచ్చిన రెండో ఫండ్‌ ఇది. ఇంతకు ముందు ట్రస్ట్‌ ఎంఎఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ పీఎస్‌యూ డెట్‌ ఫండ్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు లిక్విడ్‌ ఫండ్‌ తీసుకువచ్చింది. ఈ ఫండ్‌కు ఆనంద్‌ నెవాతియా ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. దీర్ఘకాలిక ట్రిపుల్‌ ఏ రేటింగ్‌ ఉన్న కంపెనీలకు చెందిన పత్రాల్లో పెట్టుబడి పెట్టాలనేది ఈ ఫండ్‌ ఉద్దేశం. దీనివల్ల అధిక లిక్విడిటీతో పాటు పెట్టుబడులకు భద్రత అధికంగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడికి 15% నిధులు, ప్రైవేటు కంపెనీల రుణ పత్రాలకు 35%, డిపాజిట్‌ సర్టిఫికెట్లకు 20% నిధులు  కేటాయించాలని ఈ ఫండ్‌ భావిస్తోంది.
సాధారణంగా స్వల్పకాలానికి కొంత సొమ్ము పక్కన పెట్టాలనే ఆలోచనతో ఉన్న ఇన్వెస్టర్లు లిక్విడ్‌ ఫండ్స్‌ వైపు చూస్తారు. అందువల్ల ప్రభుత్వ సంస్థల రుణపత్రాలకు అధికంగా కేటాయింపులు చేసే లిక్విడ్‌ ఫండ్స్‌తో భద్రత అధికమని ఇన్వెస్టర్ల అంచనా. ఇటీవల కాలంలో లిక్విడ్‌ ఫండ్స్‌ సగటున 3.5% వార్షిక ప్రతిఫలాన్ని ఇస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts