తక్కువ నష్టం... స్థిరమైన రాబడి..

ఆదిత్యా బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కొత్త మల్టీక్యాప్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ‘ఆదిత్యా బిర్లా సన్‌ లైఫ్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌’ అనే ఈ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ వచ్చే నెల 3. ఈ పథకంలో కనీసం...

Published : 23 Apr 2021 00:51 IST

దిత్యా బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కొత్త మల్టీక్యాప్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ‘ఆదిత్యా బిర్లా సన్‌ లైఫ్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌’ అనే ఈ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ వచ్చే నెల 3. ఈ పథకంలో కనీసం రూ.500 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లలో పెట్టుబడి పెట్టటం ద్వారా మదుపరులు అధిక లాభాలు ఆర్జించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం. లార్జ్‌ క్యాప్‌ షేర్లపై పెట్టుబడితో తక్కువ రిస్కుతో, స్థిరమైన ప్రతిఫలం... వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన వృద్ధి అవకాశాలు ఉన్న కంపెనీలను ఎంచుకునే పక్షంలో అధిక లాభాలు సంపాదించవచ్చు. అందువల్ల దీర్ఘకాలిక మదుపరులకు మల్టీ క్యాప్‌ ఫండ్లు ఆకర్షణీయమైననే భావన ఉంది. ప్రస్తుతం వడ్డీ రేట్లు ఎంతో తక్కువగా ఉండటంతో అధిక లాభాలు కావాలంటే ఈక్విటీ పెట్టుబడుల వైపు చూడాల్సి వస్తోంది. ఈ కోణంలో చూసినప్పుడు కూడా బ్యాంకు డిపాజిట్లకు మల్టీ క్యాప్‌ ఫండ్లు కొంతవరకూ ప్రత్యామ్నాయంగా ఉంటాయి. అయితే కనీసం మూడు నుంచి అయిదేళ్ల కాలానికి పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని