పెద్దల కోసం.. సీనియర్ ఫస్ట్
ఆరోగ్య బీమా పాలసీలను అందించే మ్యాక్స్ బూపా సీనియర్ సిటిజెన్ల కోసం ప్రత్యేకంగా పాలసీని విడుదల చేసింది. ఈ ‘సీనియర్ ఫస్ట్’ పాలసీని కనీసం రూ.5లక్షల నుంచి గరిష్ఠంగా రూ.25లక్షల వరకూ తీసుకునే వీలుంది. సాధారణ చికిత్సలకు ఎలాంటి కనీస పరిమితి లేకుండా పరిహారాన్ని చెల్లించే ఏర్పాటు ఇందులో ఉంది. ప్రస్తుత కొవిడ్-19 నేపథ్యంలో పాలసీ ఇచ్చేందుకు ఎలాంటి ఆరోగ్య పరీక్షలను అడగకుండానే పాలసీ అందిస్తున్నట్లు సంస్థ చెబుతోంది. ఏడాదిలో ఒకసారి ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకునే వీలుంది. దీన్ని పాలసీ తీసుకున్న తొలి రోజు నుంచి ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. కొవిడ్ చికిత్సలో భాగంగా వినియోగించే పీపీఈ కిట్, గ్లౌజులు, ఆక్సిజన్ మాస్కులులాంటి వాటికీ ఎలాంటి పరిమితి లేకుండా పరిహారం ఇచ్చేలా అనుబంధ పాలసీని తీసుకోవచ్చు. దీంతోపాటు ఏడాదిలో రూ.50,000లోపు క్లెయిం చేసుకున్నా.. నో క్లెయిం బోనస్‌పై ప్రభావం ఉండదని తెలిపింది. సహ చెల్లింపును తగ్గించుకునేందుకూ ఆప్షన్ ఉంది. ఇది గోల్డ్, ప్లాటినం పేర్లతో లభిస్తుంది. పాలసీ మొత్తం ఖర్చయినా.. తిరిగి భర్తీ చేసే రీ అస్యూర్, ఇంట్లో ఉండి చికిత్స చేయించుకున్నా పరిహారంలాంటివీ ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
-
World News
Zaporizhzhia: ఆ ప్లాంట్ పరిసరాలను సైనికరహిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉక్రెయిన్
-
India News
Internet shutdowns: ఇంటర్నెట్ సేవల నిలిపివేతలు భారత్‌లోనే ఎక్కువ.. కాంగ్రెస్ ఎంపీ
-
Sports News
Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
-
Crime News
Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
-
Movies News
Aamir Khan: ‘కేబీసీ’లో ఆమిర్ ఖాన్.. ఎంత గెలుచుకున్నారంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- Chinese mobiles: చైనాకు భారత్ మరో షాక్.. ఆ మొబైళ్లపై నిషేధం...?
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- venkaiah naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఘనమైన వీడ్కోలు
- Social Look: ‘పచ్చళ్ల స్వాతి’గా పాయల్.. మాల్దీవుల్లో షాలిని.. శ్రీలీల డబ్బింగ్!
- CWG 2022: కొవిడ్ అని తేలినా ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ స్టార్..ఎలా!
- RGUKT: అంధకారంలో బాసర ట్రిపుల్ ఐటీ.. చీకట్లోనే విద్యార్థులు భోజనం!
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!