విదేశీ ఈక్విటీల్లో పరోక్షంగా..

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆసక్తికరమైన ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌)ను ఆవిష్కరించింది. అదే ‘యాక్సిస్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’. ఈ ఎఫ్‌ఓఎఫ్‌, న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ముగింపు తేదీ ఈ నెల 21. కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకం పనితీరును ఎంఎస్‌సీఐ ఏసీ వరల్డ్‌ (నెట్‌ టీఆర్‌) (ఐఎన్‌ఆర్‌) తో పోల్చి చూస్తారు.

Published : 14 May 2021 01:10 IST

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆసక్తికరమైన ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌)ను ఆవిష్కరించింది. అదే ‘యాక్సిస్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’. ఈ ఎఫ్‌ఓఎఫ్‌, న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ముగింపు తేదీ ఈ నెల 21. కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకం పనితీరును ఎంఎస్‌సీఐ ఏసీ వరల్డ్‌ (నెట్‌ టీఆర్‌) (ఐఎన్‌ఆర్‌) తో పోల్చి చూస్తారు.
మనదేశానికి చెందిన మదుపరులకు ష్రోడర్‌ ఇంటర్నేషనల్‌ సెలక్షన్‌ ఫండ్‌ (ఎస్‌ఐఎస్‌ఎఫ్‌) గ్లోబల్‌ డిస్‌రప్షన్‌ అనే గ్లోబల్‌ ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని యాక్సిస్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ కల్పిస్తుంది. ప్రపంచ వ్యాప్త కంపెనీలు ష్రోడర్‌ ఇంటర్నేషనల్‌ సెలక్షన్‌ ఫండ్‌ (ఎస్‌ఐఎస్‌ఎఫ్‌) గ్లోబల్‌ డిస్‌రప్షన్‌ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. ఆల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌, అమెజాన్‌, టీఎస్‌ఎంసీ, ఆపిల్‌, వీసా, బ్లాక్‌రాక్‌, బుకింగ్‌ హోల్డింగ్స్‌, టెక్సాస్‌ ఇన్‌స్ట్రమెంట్స్‌, ఏఎస్‌ఎంఎల్‌ ఇందులో ఉన్న కొన్ని కంపెనీలు.
సాధారణంగా మనదేశంలో మదుపరులు విదేశీ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టటం తక్కువ. పోర్ట్‌ఫోలియో మొత్తాల్లో 1- 2 శాతం కంటే మించదు. అదే సమయంలో ఆగ్నేయ ఆసియా దేశాలకు చెందిన మదుపరులు తమ పెట్టుబడి మొత్తాల్లో 30- 50 శాతం సొమ్ము తమ దేశాలకు బయట పెట్టుబడిగా పెడుతున్నారు. తద్వారా అధిక లాభాలు ఆర్జించే అవకాశం వారికి కలుగుతోంది. ఇటువంటి అవకాశాన్ని మనదేశంలో మదుపరులకు అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో ‘యాక్సిస్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ ను తీసుకువచ్చినట్లు యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది.
ఇది థీమ్యాటిక్‌ ఫండ్‌ కోవలోకి వస్తుంది. స్వతహాగా ఇటువంటి పథకాల్లో రిస్కు అధికంగా ఉంటుంది. ఫండ్‌ వ్యయాల నిష్పత్తి (ఎక్స్‌పెన్సెస్‌ రేషియో) కూడా ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల మదుపరులు తాము ఏ మేరకు రిస్కును తట్టుకోగలమనే విషయాన్ని బేరీజు వేసుకొని ఈ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని నిర్ణయించుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని