దీర్ఘకాలిక మదుపరుల కోసం

వాల్యూ ఫండ్స్‌ తరగతికి చెందిన ఒక నూతన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ఐటీఐ వాల్యూ ఫండ్‌ అనే ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ముగింపు తేదీ వచ్చే నెల 8.

Published : 28 May 2021 00:13 IST

ఐటీఐ వాల్యూ ఫండ్‌

వాల్యూ ఫండ్స్‌ తరగతికి చెందిన ఒక నూతన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ఐటీఐ వాల్యూ ఫండ్‌ అనే ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ముగింపు తేదీ వచ్చే నెల 8. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్‌గా ప్రదీప్‌ గోఖలే, రోహన్‌ కార్డే వ్యవహరిస్తారు. దీర్ఘకాలంలో ఒక మాదిరి ప్రతిఫలం ఆశించే మదుపరులకు ఇటువంటి పథకాలు అనుకూలంగా ఉంటాయి.
ఐటీఐ వాల్యూ ఫండ్‌ పనితీరును నిఫ్టీ 500 వాల్యూ 50 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ (టై) తో పోల్చి చూస్తారు. పోర్ట్‌ఫోలియో నిర్మాణంలో భాగంగా ఈ ఫండ్‌ ఒక్కో కంపెనీ ఆదాయాలు- లాభాల తీరు, పెట్టుబడిపై ప్రతిఫలం (ఆర్‌ఓఈ- రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ), రుణ భారం లేకపోవటం లేదా తక్కువగా ఉండటం, యాజమాన్యం సత్తా, సులభతరమైన వ్యాపార విధానం, పెట్టుబడికి తగిన విలువ... వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీర్ఘకాలిక మూలధన వృద్ధి లక్ష్యంగా ఐటీఐ వాల్యూ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐఓ జార్జి హెబెర్‌ జోసెఫ్‌ పేర్కొన్నారు. ఈ పథకం కింద 65 శాతానికి పైగా ఈక్విటీ పెట్టుబడులు పెడతారు. రుణ పత్రాల్లో 35 శాతం వరకూ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.  
ప్రస్తుతం మార్కెట్లో పలు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు చెందిన వాల్యూ ఫండ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాలపై మూడేళ్ల సగటు ప్రతిఫలాన్ని చూస్తే... 12 శాతానికి పైగా లాభాలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని