మదుపు చేద్దాం.. పొరపాట్లు లేకుండా..
ఒక పని చేసేటప్పుడు వందకు వంద శాతం విజయం సాధిస్తామని చెప్పలేం. కొన్ని పొరపాట్లు చేయొచ్చు. తాను చేసే తప్పులతో పాటు.. ఇతరుల పొరపాట్లనూ గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటూ.. వెళ్లేవారే ఎప్పటికైనా విజయ తీరాలకు చేరుతారు. జరిగిన సంఘటనలను మార్చలేం. కానీ, నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూడగలం. పెట్టుబడుల విషయమూ అంతే! పొరపాటు నిర్ణయం తీసుకుంటే.. దీర్ఘకాలంపాటు అది మనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
పెట్టుబడుల విషయంలో.. మన సొంత, పక్కవారి ఆలోచనలు, భావోద్వేగాలు.. ఎన్నోసార్లు మనం చేసే పనిని నియంత్రిస్తూ ఉంటాయి. దీంతో మనకు అవసరం లేని పథకాలను ఎంపిక చేసుకుంటాం. లక్ష్యం చేరే మార్గంలో కాకుండా.. మరో తోవలో మన మదుపు ప్రయాణం సాగుతూ ఉంటుంది. దీనివల్ల ఎప్పటికీ మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోలేం. అయితే.. పెట్టుబడి నిర్ణయాల్లో పొరపాట్లు దొర్లినా వాటిని వెంటనే సరిచేసుకోవడానికి అవకాశం ఉందన్న సంగతిని ఇక్కడ మనం గుర్తించాలి. ఎక్కడ తప్పు జరిగింది.. దాన్ని నివారించేందుకు ఏం చేయాలి అనేది గుర్తించే ప్రయత్నం చేయాలి.
సాధారణంగా మదుపు చేసేటప్పుడు మదుపరుల మనసులో ఉండే కొన్ని అపోహలు.. వాటికి సమాధానాలు తెలుసుకుందాం..
అతి ప్రేమ: మన అనుభవాలు నేర్పిన పాఠాలపై మనకు ఎంతో నమ్మకం ఉంటుంది. ఒక పెట్టుబడి పథకం మంచి రాబడిని ఇచ్చిన అనుభవం ఉంటే.. ఇక ఏ ఇతర పథకం గురించీ మనం ఆలోచించం. ఆ సంస్థపైనే మన గురి ఉంటుంది. ఇది అసాధారణమేమీ కాదు. అదే సమయంలో సరైన పద్ధతీ కాదు. క్రికెట్ టీంలో ప్రతి ఆటగాడికీ ఒక్కో నైపుణ్యం ఉంటుంది. జట్టుగా విజయం సాధించేందుకు ఆ నైపుణ్యాలన్నీ అవసరమే. అలాగే.. ప్రతి పెట్టుబడి పథకం భిన్నంగా ఉంటుంది. దాన్ని నిర్వహించే తీరూ వేర్వేరుగా ఉంటుంది. మీ పెట్టుబడి పథకాల్లో ఉన్న ఈ నైపుణ్యాలను బేరీజు వేసుకోవాలి. ఆ తర్వాతే సరైన నిర్ణయం తీసుకోవాలి.
ఒకటే సూత్రం: మీరు హాస్య ప్రధాన సినిమా చూస్తున్నారనుకోండి.. అందులో యాక్షన్ సన్నివేశాలు లేవని ఆ చిత్రం నచ్చలేదని అనలేం కదా! ఈ రెండింటి మధ్య ఎంతో తేడా ఉంటుంది. పెట్టుబడుల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. రెండు వేర్వేరు పెట్టుబడి వ్యూహాలు ఉన్న పథకాలను పోల్చి చూడలేం. ఈక్విటీ ఫండ్లు.. డెట్ ఫండ్లు రెండూ పూర్తిగా వేర్వేరు. సొంతంగా షేర్లను కొనుగోలు చేయడం.. ఆర్బిట్రేజ్ ఫండ్లలో మదుపు చేయడమూ భిన్నమే. కాబట్టి, పథకాలను ఎంచుకునేటప్పుడు మీరు ఏ విభాగంలో మదుపు చేస్తున్నారో వాటితోనే పోల్చి చూడాలి. ఆ విభాగంలోని రెండు ఫండ్లనూ నిశితంగా పరిశీలించాలి. అప్పుడే వాటి మధ్య తేడా ఏమిటన్నది మనకు అర్థం అవుతుంది.
సూచీ ఫండ్లలో: సూచీలను అనుసరిస్తూ పెట్టుబడి పెట్టే పాసివ్ ఫండ్లు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. సూచీలను అనుసరిస్తూ ఇవి మదుపు చేస్తాయి. కానీ, అన్ని పాసివ్ ఫండ్లూ మంచివేనా అంటే చెప్పలేం. అవి అనుసరించే సూచీల ఆధారంగా అవి అందించే లాభాలు ఆధారపడి ఉంటాయి. ప్రామాణిక సూచీలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోవడం, ట్రాకింగ్ పొరపాట్లు ఇలా ఎన్నో ఫండ్ల లాభాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి, పాసివ్ ఫండ్లలో మదుపు చేసేటప్పుడూ.. తగిన పరిశోధన తప్పనిసరి.
ఏడాది రాబడి: ఒక ఏడాదిలో ఒక ఫండ్ సాధించిన రాబడిని చూసి మదుపు చేయడం ఎప్పుడూ పొరపాటే. ఇవి సాధారణంగా మదుపరులను తప్పుదోవ పట్టిస్తాయి. చాలామంది వీటి ఆధారంగానే తమ నిర్ణయాలు తీసుకుంటారు. ఏడాది కాలంలో వచ్చిన రాబడి ఆ ఫండ్ మేనేజర్ నైపుణ్యం, ఆ ఫండ్ వాస్తవ పనితీరు తదితరాల గురించి మీకు పూర్తిగా తెలియజేయదు. దాని భవిష్యత్తునూ అంచనా వేయలేం. 3, 5 ఏళ్ల కాలంలోనూ ఈక్విటీ ఫండ్లలో వచ్చిన రాబడి సమయానుకూలంగా మారుతూ ఉంటుంది. దీనికి బదులుగా వివిధ మార్కెట్ దశల్లో ఫండ్ పనితీరు, ఇస్తున్న రాబడి వివరాలను పరిశోధిస్తే.. మంచి ఫండ్‌ను ఎంచుకోవడం కష్టం కాదు.
ఒకేలా ఉండదు: ప్రపంచంలో ఒక్కో దేశానికీ ఒక్కో సంస్కృతి ఉంటుంది. పెట్టుబడుల విషయమూ అంతే. మార్కెట్లను బట్టి వ్యూహాలు మారుతూ ఉండాలి. ఒక మార్కెట్లో ఒక పెట్టుబడి విధానానికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. మరో మార్కెట్లో ఇది అంత ఫలితం ఇవ్వలేకపోవచ్చు. ఉదాహరణకు అమెరికా మార్కెట్లో నిర్మాణాత్మకంగా ఈటీఎఫ్‌లు మంచి ప్రయోజనాలను అందిస్తుంటాయి. భారత్‌లో ఇండెక్స్ ఫండ్లు నిర్మాణాత్మకంగా బాగున్నాయి. వీటి మధ్య తేడా గుర్తించి పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి.
సమీక్షిస్తూ: మీ పెట్టుబడుల జాబితాలో ఏ పథకాలున్నాయో.. వాటి పనితీరు ఎలా ఉందో ఎప్పటికప్పుడు మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. ఫండ్ మేనేజర్ ఏం చెబుతున్నారు.. మార్కెట్ పోకడ గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మీరు మదుపు చేసిన పథకం నెలవారీ పెట్టుబడుల జాబితాను క్షుణ్నంగా పరిశీలించాలి.
అనుకరణ: వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక.. పేరులోనే ఉన్నట్లు ఇది ఎవరికి వారికి వ్యక్తిగతమే. ప్రతి వ్యక్తి ఇక్కడ విభిన్నమే. ఒక వ్యక్తి ఆశలు, లక్ష్యాలు, బాధ్యతలు, నైపుణ్యాలు, ఆస్తులు అన్నీ ఇతరులతో పోల్చి చూసినప్పుడు ప్రత్యేకంగానే ఉంటాయి. ఎవరో చెప్పారని.. ఒక వాట్సాప్ గ్రూపులో వచ్చిందని మీ పెట్టుబడి నిర్ణయాలు ప్రభావితం కాకూడదు. మీకు వ్యక్తిగతంగా ఏది అనుకూలమో.. మీరే సొంతంగా పరిశోధించాలి. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి.
రుసుములు పట్టించుకోకపోవడం: కొంతమంది తరచూ పెట్టుబడి పథకాలను మారుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అమ్మకపు రుసుముల భారం భరించాల్సి ఉంటుంది. ఇది మన లాభాలను తగ్గిస్తుంది. కాబట్టి, ఫండ్ యూనిట్లను విక్రయించడం, కొత్తవి కొనుగోలు చేసినప్పుడు రుసుములు ఎలా ఉన్నాయి.. ఆదాయపు పన్ను ప్రభావం వంటి వాటినీ లెక్కలోకి తీసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు.. స్టార్ హీరో ఎవరో తెలియదన్నాడు
-
Sports News
CWG 2022: ఐస్‌క్రీం ఇప్పుడు తినొచ్చు.. ఇదే అమ్మకు బర్త్‌డే గిఫ్ట్..!
-
Politics News
Rajagopal Reddy: ఆ నలుగురు మంత్రులు ఉద్యమకారులా?: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
-
Sports News
CWG 2022 : అమ్మాయిల ఫైనల్ పోరు సమయంలో.. రోహిత్ సేన ఇలా..
-
India News
India Corona: కొనసాగుతోన్న హెచ్చుతగ్గులు.. కొత్త కేసులు ఎన్నంటే..?
-
Movies News
Rajeev Kanakala: ‘లవ్‌స్టోరీ’లో బాబాయ్ పాత్ర.. ఇబ్బంది పడ్డా! : రాజీవ్ కనకాల
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస