పాన్‌తో ఆధార్ అనుసంధానం చేశారా?
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఉన్న ప్రతి వ్యక్తీ.. దానికి ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయాల్సిందే. జూన్ 30 లోగా (ప్రస్తుత నిబంధనల ప్రకారం) ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే.. కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.
బ్యాంకింగ్ సేవలను పొందడం, డెబిట్, క్రెడిట్ కార్డులను వాడడం, ఆన్లైన్ చెల్లింపులు, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ ఇలాంటి సేవలన్నీ పొందాలంటే.. మీ పాన్‌ను ఆధార్‌ను జత చేయాల్సిందే. లేకపోతే.. ఈ సేవలకు విఘాతం కలిగే ఆస్కారం ఉంది. దీంతోపాటు.. మీకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే వడ్డీ, డివిడెండు, ఇతర ఆదాయాలపైనా అధిక మొత్తంలో పన్ను కోత విధించే అవకాశం ఉంది. ఒకసారి ఇలా విధించిన పన్నును తిరిగి వెనక్కి తీసుకునే అవకాశమూ ఉండదు.
ఆదాయపు పన్ను శాఖ ఇటీవల మార్చిన నిబంధనల మేరకు ప్రతి జులై 1 నుంచి ప్రతి పాన్.. ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. లేకపోతే ఆ పాన్ చెల్లదు. కాబట్టి, మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) చేసేవారు ఇలాంటి పాన్ ఉన్న వారికి 20శాతం వరకూ పన్ను విధించాల్సి ఉంటుంది. అయితే టీడీఎస్ చేయని ఆదాయాలకు ఇది వర్తించదు. మీ పాన్‌ను ఆధార్‌తో జత చేసిన సమాచారాన్ని బ్యాంకులు, అసెట్ మేనేజ్మెంట్ సంస్థలకూ సమాచారం ఇవ్వడమూ మంచిదే. జులై 1 తర్వాత ఆధార్ అనుసంధానం కాని పాన్ ఉన్న వారికి రూ.10వేల జరిమానా విధించే అవకాశమూ ఉంది. కాబట్టి, వీలైనంత తొందరగా www.incometax.gov.in పోర్టల్‌లోకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయండి. ఇప్పటికే మీరు ఈ రెండింటినీ జత చేసుకున్నా.. మరోసారి ఇఫైలింగ్ వెబ్సైటులోకి వెళ్లి, తనిఖీ చేసుకోవడం మంచిది. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. పాన్, ఆధార్‌లో పుట్టిన తేదీ వేర్వేరుగా ఉంటే.. అనుసంధానం కుదరకపోవచ్చు. పేరులో తప్పులున్నా సాధ్యం కాదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Imran Khan: ర్యాలీలో వీడియో ప్లేచేసి.. భారత్‌ను ప్రశంసించిన ఇమ్రాన్ ఖాన్
-
General News
Andhra News: ప్రభుత్వ నిర్ణయంతో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం
-
Movies News
Laal Singh Chaddha: ‘లాల్‌సింగ్ చడ్డా’ వీక్షించిన సీఎం మాన్.. ఏమన్నారంటే?
-
Politics News
Gorantla madhav: నాపై ప్రచారం చేస్తే పాత మాధవ్‌ను చూస్తారు: గోరంట్ల
-
Politics News
తుపాకి పేల్చితే రాజీనామా అంటున్నారు.. ఇదేం కక్కుర్తి రాజకీయం: శ్రీనివాస్‌గౌడ్
-
Crime News
Cairo: చర్చిలో ఘోర అగ్నిప్రమాదం.. 41మంది సజీవ దహనం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- RRR: ఆస్కార్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్?
- Vijay Deverakonda: డేటింగ్ లైఫ్.. ఆమెకు ఇలాంటివి నచ్చవు: విజయ్ దేవరకొండ