వృద్ధి అవకాశాలు ఉన్న రంగాల్లో...
దీర్ఘకాలంలో మూలధన వృద్ధిని ఆశించే మదుపరులను దృష్టిలో పెట్టుకొని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ పథకం
దీర్ఘకాలంలో మూలధన వృద్ధిని ఆశించే మదుపరులను దృష్టిలో పెట్టుకొని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌ఓ) ముగింపు తేదీ నెల 25. దీని కింద సమీకరించిన నిధులను బ్యాంకింగ్, బ్రోకింగ్, అసెట్, వెల్త్ మేనేజ్‌మెంట్, బీమా, ఎన్‌బీఎఫ్‌సీ, ఇతర ఆర్థిక సేవలకు చెందిన కంపెనీలపై ప్రధానంగా పెట్టుబడిగా పెడతారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) నుంచి వచ్చే కొన్నేళ్ల పాటు మనదేశంలో వృద్ధి రేటు ఆకర్షణీయంగా నమోదవుతుంది. దీనివల్ల ఎన్నో ఏళ్ల తర్వాత బ్యాంకింగ్ రంగం మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. రాని బాకీల భారం తగ్గుతోంది. మళ్లీ పెట్టుబడుల్లో, రుణాల్లో వృద్ధి నమోదయ్యే సంకేతాలు వస్తున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల్లో టెక్నాలజీ వినియోగం వల్ల లావాదేవీలు ఎంతో సులభతరం కావటంతో పాటు ఆయా సంస్థలకు నిర్వహణ వ్యయాలు ఎంతగానో తగ్గాయి. తక్కువ వడ్డీ రేట్లు. స్టాక్ మార్కెట్లో రిటైల్ మదుపరుల పాత్ర పెరగటం ఒక సానుకూలత. ఈ కారణాలతో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్‌ను తీసుకువచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది.
ఇప్పటికే పలు సంస్థలకు చెందిన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్లు మదుపరులకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫండ్లు గత మూడేళ్ల కాలంలో సగటున 10 శాతం మేరకు ప్రతిఫలాన్ని ఆర్జించాయి. అయిదేళ్ల కాలం సగటు ఇంకొంత ఆకర్షణీయంగా 15 శాతం మేరకు ఉంది. ఈ విభాగంలో దాదాపు రూ.4,000 కోట్ల నికర ఆస్తులతో ఐసీఐసీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో రూ.2400 కోట్ల నికర ఆస్తులతో ఎస్‌బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Canada Singer: ‘భారత్ నా దేశం కూడా..!’: టూర్ రద్దుపై కెనడా సింగర్ శుభ్
-
Bedurulanka 2012: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘బెదురులంక’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
-
AP Assembly: రెండోరోజూ స్పీకర్ పోడియం వద్ద తెదేపా ఎమ్మెల్యేల నిరసన
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
TDP: అసెంబ్లీకి రెండో రోజూ పాదయాత్రగా వెళ్లిన తెదేపా ఎమ్మెల్యేలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు