ఎన్‌పీఎస్‌.. రూ.5లక్షల వరకూ వెనక్కి

జాతీయ పింఛను పథకాన్ని (ఎన్‌పీఎస్‌) మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు పింఛను  నిధి నియంత్రణ, అభివృధ్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) కొన్ని నిబంధనలను సడలించింది. ఇందులో భాగంగా రూ.5

Published : 18 Jun 2021 00:23 IST

జాతీయ పింఛను పథకాన్ని (ఎన్‌పీఎస్‌) మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు పింఛను  నిధి నియంత్రణ, అభివృధ్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) కొన్ని నిబంధనలను సడలించింది. ఇందులో భాగంగా రూ.5 లక్షల లోపు ఎన్‌పీఎస్‌ నిధి ఉన్నవారు పదవీ విరమణ చేసినా.. ఎన్‌పీఎస్‌ నుంచి బయటకు రావాలని అనుకున్నా.. మొత్తం సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఇప్పటివరకూ ఎన్‌పీఎస్‌ నుంచి పెట్టుబడిని పూర్తిగా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉండేది కాదు. రూ.2లక్షల మొత్తం దాటితే.. పదవీ విరమణ తర్వాత లేదా 60 ఏళ్ల తర్వాత కనీసం 40శాతంతో బీమా సంస్థలు అందించే యాన్యుటీ పథకాలను తప్పనిసరిగా కొనాల్సి వచ్చేది. మిగిలిన 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకునే వీలుండేది. ఇప్పుడు రూ.5లక్షల వరకూ ఎలాంటి యాన్యుటీ పథకాలను కొనాల్సిన అవసరం లేదు. దీంతోపాటు.. ఎవరైనా గడువుకు ముందే ఎన్‌పీఎస్‌ నుంచి బయటకు రావాలనుకుంటే.. ఇప్పటి వరకూ ఉన్న రూ.లక్ష పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచారు. దీంతోపాటు ఎన్‌పీఎస్‌లో చేరే వయసు ఇప్పటివరకూ 65 ఏళ్లు ఉండగా.. దీన్ని 70 ఏళ్ల వయసుకు పెంచారు. అదే విధంగా పథకంలో 75 ఏళ్ల వయసు వచ్చే వరకూ కొనసాగవచ్చు. ఎన్‌పీఎస్‌ను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా ఏజెంట్లూ ఈ పథకాన్ని అందించేందుకు వీలును కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని