స్థిరమైన రాబడి ఆర్జించేలా..
టాటా మ్యూచువల్ ఫండ్ రుణ విభాగంలో ఒక కొత్త ఫ్లోటింగ్ రేట్ ఫండ్‌ను ఆవిష్కరించింది. టాటా ఫ్లోటింగ్ రేట్ అనే ఈ ఫండ్ ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ వచ్చే నెల 5. కనీస పెట్టుబడి రూ.5,000.
టాటా మ్యూచువల్ ఫండ్ రుణ విభాగంలో ఒక కొత్త ఫ్లోటింగ్ రేట్ ఫండ్‌ను ఆవిష్కరించింది. టాటా ఫ్లోటింగ్ రేట్ అనే ఈ ఫండ్ ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ వచ్చే నెల 5. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. ‘డెట్ స్కీమ్- ఫ్లోటర్ ఫండ్’ విభాగానికి చెందుతుంది. ఈ ఫండ్ కింద సేకరించిన నిధులను ప్రధానంగా ఫ్లోటింగ్ రేట్ సెక్యూరిటీల్లో పెట్టుబడిగా పెడతారు. తద్వారా స్థిరమైన ఆదాయాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు.
ఫ్లోటింగ్ రేట్ ఫండ్లకు ప్రధానంగా వడ్డీరేటు రిస్కు, లిక్విడిటీ రిస్కు ఉంటాయి. ప్రస్తుతం మనదేశంలో వడ్డీరేట్లు ఎంతో తక్కువగా ఉండగా, నగదు లభ్యత అధికంగా ఉండటం, ద్రవ్యోల్బణం పెరిగిపోయే ముప్పు పొంచి ఉండటం, మళ్లీ వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం కనిపించటం... ప్రధానంగా గమనించాల్సిన అంశాలు. అదే సమయంలో పెట్టుబడికి తగినంతగా ఫ్లోటింగ్ రేట్ రుణ పత్రాలు కూడా లభించవు. అందువల్ల ఈ విభాగంలో లిక్విడిటీ ఎంతో తక్కువ. ఈ పరిస్థితుల్లో ఫ్లోటింగ్ రేట్ ఫండ్ల నిర్వహణలో ఫండ్ మేనేజర్ ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మెరుగైన ప్రతిఫలాన్ని రాబట్టలేని పరిస్థితి ఉత్పన్నం అవుతుంది.
వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్‌లో పెట్టుబడి ‘హెడ్జింగ్’ కింద పరిగణించే వారు ఉన్నారు. కానీ దాని కోసం ఫండ్ మేనేజర్ తక్కువ రుణ నాణ్యత (క్రెడిట్ క్వాలిటీ) ఫ్లోటింగ్ రేట్ పత్రాల వైపు మొగ్గుచూపాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో అన్ని రకాలైన మదుపరులకు ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్ సరిపడవు. ఈ విభాగంపై తగిన అవగాహన కలిగిన వారికి, తమ డెట్ ఫండ్ల పోర్ట్‌ఫోలియోను వివిధీకరణ (డైవర్సిఫికేషన్) చేయాలనుకునే వారికి టాటా ఫ్లోటింగ్ రేట్ ఫండ్ పరిశీలనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ