క్రెడిట్ స్కోరు.. లెక్క మారుతోంది..
అప్పు తీసుకోవాలనుకున్నప్పుడు.. ఒక వ్యక్తి క్రెడిట్ స్కోరు ఎంతో కీలకమన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏదేని రుణం తీసుకున్న, క్రెడిట్ కార్డు వాడుతున్న వారికే రుణ చరిత్ర, క్రెడిట్ స్కోరు ఉంటుంది.
అప్పు తీసుకోవాలనుకున్నప్పుడు.. ఒక వ్యక్తి క్రెడిట్ స్కోరు ఎంతో కీలకమన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏదేని రుణం తీసుకున్న, క్రెడిట్ కార్డు వాడుతున్న వారికే రుణ చరిత్ర, క్రెడిట్ స్కోరు ఉంటుంది. మరి, ఇలాంటివేమీ లేని వారికి స్కోరును ఎలా లెక్కిస్తారు? తొలిసారి రుణం తీసుకునే వారికి అర్హతను నిర్ణయించేందుకు ఏం చూస్తారు?
రుణాలు తీసుకున్న వారికే కాకుండా.. ఇతరులకూ క్రెడిట్ స్కోరు ఇచ్చేందుకు ఇప్పుడు ఎన్నో సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ కొత్త రుణ గ్రహీతలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేవలం రుణాలకు సంబంధించిన చెల్లింపుల వివరాలతోనే క్రెడిట్ స్కోరును గుర్తించకుండా.. ఒక వ్యక్తికి సంబంధించి ఇతర సమాచారాన్నీ ఇవి సేకరిస్తున్నాయి.
మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ క్రెడిట్ స్కోరింగ్ సంస్థలు.. ఒక వ్యక్తి బ్యాంకు నిల్వ ఎంతుంది? అతను వివిధ బిల్లులను ఎలా చెల్లిస్తున్నాడు.. ఇ-కామర్స్ వెబ్సైట్లలో కొనుగోలు తీరు ఎలా ఉంది? ప్రయాణాలు చేస్తున్నారా? అక్కడికి వెళ్లినప్పుడు ఖర్చు ఎలా పెడుతున్నారు.. ఇలాంటి అంశాలన్నీ క్రోడీకరిస్తున్నాయి. సామాజిక వేదికలు, ఇంటర్నెట్ వాడకంలాంటివీ క్రెడిట్ స్కోరులో పరిగణనలోనికి తీసుకుంటున్నాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇలాంటి స్కోరును చూసి రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి, రుణం తీసుకోవాలనుకునే వారు.. ఇక నుంచి బిల్లులు, బీమా పాలసీల చెల్లింపులు, ఫోన్ రీఛార్జీల వంటి వాటి విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్