దీర్ఘకాలిక పెట్టుబడి కోసం...

లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ అనే పరిమితి లేకుండా ఏ తరగతి చెందిన కంపెనీల్లోనైనా పెట్టుబడి పెట్టేందుకు వీలుండే ఫ్లెక్సీక్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలకు ఇటీవల కాలంలో ఆదరణ పెరిగింది. వివిధ తరగతులకు చెందిన షేర్లలో వైవిధ్యంగా మదుపు చేయడం ద్వారా అధిక లాభాలు

Published : 30 Jul 2021 02:21 IST

మహీంద్రా మనులైఫ్‌  ఫ్లెక్సీ క్యాప్‌ యోజన

లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ అనే పరిమితి లేకుండా ఏ తరగతి చెందిన కంపెనీల్లోనైనా పెట్టుబడి పెట్టేందుకు వీలుండే ఫ్లెక్సీక్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలకు ఇటీవల కాలంలో ఆదరణ పెరిగింది. వివిధ తరగతులకు చెందిన షేర్లలో వైవిధ్యంగా మదుపు చేయడం ద్వారా అధిక లాభాలు ఆర్జించటం ఈ విభాగంలోని ఫండ్ల ప్రధానోద్దేశం. ఈ పథకాన్ని నిర్వహించటంలో ఫండ్‌ మేనేజర్‌కు విచక్షణ అధికంగా ఉంటుంది. తద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చు. అదే సమయంలో అంచనా తప్పయితే నష్టాల పాలయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
ఈ తరహా ఫండ్‌ను మహీంద్రా మనులైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ వచ్చే నెల 13.

ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌. దీనికి ఫతేమా పాచా ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్ల వైపు మదుపరులు మొగ్గుచూపుతున్నందున మహీంద్రా మనులైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కూడా ఈ తరహా పథకాన్ని తీసుకువచ్చింది. దీర్ఘకాలిక మదుపరులకు ఇటువంటివి అనువుగా ఉంటాయి.


నిప్పాన్‌ ఇండియా ఫ్లెక్సి క్యాప్‌ ఫండ్‌

ఈ ఫ్లెక్సీ క్యాప్‌ విభాగంలోనే నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌, ‘నిప్పాన్‌ ఇండియా ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌’ను తీసుకొచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 9. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకంలో కనీసం రూ.500 మదుపు చేయాలి. మనీష్‌ గున్వాని, ద్రుమిల్‌ షా, వరుణ్‌ గోయంకా, నిఖిల్‌ రుంగ్తా, కింజల్‌ దేశాయ్‌ దీనికి ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. నిఫ్టీ 500 ఇండెక్స్‌ టీఆర్‌ఐ సూచీతో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపరులకు అధిక లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఫెక్సీ క్యాప్‌లతోనే ఉన్నట్లు, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని