అమెరికాలో మదుపు చేస్తారా?

వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్న యూఎస్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటం ద్వారా అధిక లాభాలు ఆర్జించాలనుకునే దేశీయ మదుపరులను దృష్టిలో పెట్టుకొని ఒక ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌) ను ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌

Published : 30 Jul 2021 02:21 IST

ఐడీఎఫ్‌సీ యూఎస్‌ ఈక్విటీ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌

వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్న యూఎస్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటం ద్వారా అధిక లాభాలు ఆర్జించాలనుకునే దేశీయ మదుపరులను దృష్టిలో పెట్టుకొని ఒక ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌) ను ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ఐడీఎఫ్‌ ఎంఎఫ్‌ నుంచి వస్తున్న మొదటి అంతర్జాతీయ ఫండ్‌ ఇదే కావటం గమనార్హం.

ఐడీఎఫ్‌సీ యూఎస్‌ ఈక్విటీ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌) అనే పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ వచ్చే నెల 12. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. కనీస పెట్టుబడి రూ.5,000. సిప్‌ ద్వారా (క్రమానుగత పెట్టుబడి విధానం) కనీసం రూ.1,000 మదుపు చేయొచ్చు. మదుపరులు ఏడాది లోపు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే 1 శాతం ‘ఎగ్జిట్‌ లోడ్‌’ భరించాలి. ఈ ఫండ్‌ వ్యయాల నిష్పత్తి (ఎక్స్‌పెన్సెస్‌ రేషియో) 2.25 శాతం ఉంది.

ఈ ఫండ్‌కు, యూఎస్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే జేపీ మోర్గాన్‌ యూఎస్‌ గ్రోత్‌ ఫండ్‌ ‘అండర్‌ లైయింగ్‌’ ఫండ్‌గా ఉంటుంది. జేపీ మోర్గాన్‌ యూఎస్‌ గ్రోత్‌ ఫండ్‌ అజమాయిషీ కింద 1.8 బిలియన్‌ డాలర్ల ఏయూఎం (అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌) ఉంది. ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో ఆల్ఫాబెట్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌... తదితర కంపెనీలు ఉన్నాయి. ఇటువంటి ఇతర మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల యూనిట్లు లేదా ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజి ట్రేడెడ్‌ ఫండ్‌) యూనిట్లలోనూ ఐడీఎఫ్‌సీ యూఎస్‌ ఈక్విటీ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

ఐడీఎఫ్‌సీ యూఎస్‌ ఈక్విటీ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ అమెరికాలో మార్కెట్లో పెట్టుబడి పెట్టే పరోక్ష పథకం- అని చెప్పవచ్చు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాల కోసం చూస్తూ..., తమ పెట్టుబడుల్లో కొంత వైవిధ్యం ఉండాలనుకునే దేశీయ మదుపరులకు అనువైనదిగా కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని