మూలధన వృద్ధికి...

‘యూటీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌’ అనే నూతన ఈక్విటీ పథకాన్ని యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. దీని ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 18. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి

Updated : 06 Aug 2021 05:03 IST

యూటీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌

‘యూటీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌’ అనే నూతన ఈక్విటీ పథకాన్ని యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. దీని ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 18. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. దీర్ఘకాలిక మూలధన వృద్ధి సాధించటం ఈ పథకం ప్రధానోద్దేశం. అన్ని మార్కెట్‌ క్యాప్స్‌ విభాగాలకు చెందిన 30 కంపెనీలను పెట్టుబడి కోసం ఎంచుకుంటారు. అధిక వృద్ధి సాధించే అవకాశాలు ఉన్న కంపెనీలను ‘బాటమ్‌ అప్‌’ పద్ధతిలో ఎంపిక చేస్తారు. మేనేజ్‌మెంట్‌ పరంగా సమస్యలు ఉంటే..., లేదా రుణభారం అధికంగా ఉన్న కంపెనీలు, నగదు లభ్యత స్ధిరంగా లేకపోవటం, ఆర్‌ఓసీఈ తక్కువగా ఉండటం... వంటి సవాళ్లు ఉన్న కంపెనీలను పరిగణనలోకి తీసుకోరు. ఈ పథకానికి సుధాంశు అస్తానా ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. నిఫ్టీ 500 టీఆర్‌ఐ (టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌) పనితీరును దీనికి ప్రామాణికంగా తీసుకుంటారు.


నిఫ్టీ సూచీల్లోని షేర్లలో

హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఫండ్‌

‘ఇండెక్స్‌ ఫండ్స్‌’ విభాగంలో ఒక కొత్త పథకాన్ని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఫండ్‌ - అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 13. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5000 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ టీఆర్‌ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలోని 50 కంపెనీలపై పెట్టుబడి పెట్టాలనుకునే మదుపరులకు ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. ఈ విభాగంలో ఇప్పటికే ఇతర మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల నుంచి కొన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాల పనితీరు కూడా మెరుగ్గానే ఉండటం గమనార్హం. ఇటీవల కాలంలో నిఫ్టీ సూచీ ఆకర్షణీయమైన వృద్ధి సాధించటం దీనికి కారణం. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఇదే తరహా పథకాన్ని తీసుకువచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు