ప్రమాద బీమా.. రూ. 10 కోట్ల వరకూ

ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం ఇచ్చే వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని నివా బూపా (మ్యాక్స్‌ బూపా) హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఆవిష్కరించింది. ఇందులో పాలసీదారులు తమ వార్షికాదాయానికి 25 రెట్ల వరకూ బీమా పొందే వీలుంది. గరిష్ఠంగా రూ.10 కోట్ల విలువ వరకూ పాలసీని ఎంచుకోవచ్చు.

Updated : 27 Aug 2021 05:22 IST

ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం ఇచ్చే వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని నివా బూపా (మ్యాక్స్‌ బూపా) హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఆవిష్కరించింది. ఇందులో పాలసీదారులు తమ వార్షికాదాయానికి 25 రెట్ల వరకూ బీమా పొందే వీలుంది. గరిష్ఠంగా రూ.10 కోట్ల విలువ వరకూ పాలసీని ఎంచుకోవచ్చు. ప్రమాదం కారణంగా పాలసీదారుడికి పాక్షిక శాశ్వత వైకల్యం ఏర్పడితే.. ప్రాథమిక పాలసీ విలువలో 2శాతం (గరిష్ఠంగా రూ.లక్ష) చెల్లిస్తుంది. ప్రమాదం అనంతరం మూడు నెలలపాటు పనిచేసేందుకు వీలు కాకపోతే.. పాలసీ విలువలో 0.5శాతం నెలనెలా చెల్లిస్తుంది. పాలసీదారుడు మరణించినప్పుడు లేదా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు పిల్లలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వీలుగా చదువు కోసం గరిష్ఠంగా రూ.5లక్షల వరకూ, పెళ్లి ఖర్చుల కోసం రూ.10లక్షల వరకూ పరిహారం ఇస్తుంది. ఇది పాలసీ విలువను బట్టి, ఆధారపడి ఉంటుంది. లోన్‌ ప్రొటెక్టర్‌ బెనిఫిట్‌నూ ఇందులో జత చేసుకోవచ్చు. దీనివల్ల పాలసీదారుడికి ఉన్న రుణాలను ఈ పాలసీ చెల్లించి, మిగతా మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందిస్తుంది. ఈ పాలసీ కనీస ప్రీమియం రూ.962 నుంచి ప్రారంభమవుతుంది. కనీస పాలసీ విలువ రూ.5లక్షలు. వయసుతో నిమిత్తం లేకుండా పాలసీ మొత్తాన్ని బట్టి, ప్రీమియాలు ఆధారపడి ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని