Nominee: నామినీ పేరు రాశారా?
బ్యాంకు ఖాతా.. పెట్టుబడులు.. పథకాలు.. జీవిత బీమా పాలసీలు.. ఈపీఎఫ్.. తదితరాలు ఏవైనా సరే.. అందులో నామినీ పేరు తప్పనిసరి. అయితే, చాలామంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఏ ఇబ్బందీ రాదు కానీ..
బ్యాంకు ఖాతా.. పెట్టుబడులు.. పథకాలు.. జీవిత బీమా పాలసీలు.. ఈపీఎఫ్.. తదితరాలు ఏవైనా సరే.. అందులో నామినీ పేరు తప్పనిసరి. అయితే, చాలామంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఏ ఇబ్బందీ రాదు కానీ.. పెట్టుబడిదారుడికి అనుకోనిదేదైనా జరిగినప్పుడు.. కుటుంబ సభ్యులు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నిజానికి నామినీ.. చట్టబద్ధమైన వారసులు వేర్వేరు. పెట్టుబడులు వారసులందరికీ చేరేందుకు.. నామినీ ఒక వారధి మాత్రమే. అంటే.. పెట్టుబడిదారుడికి ఏదైనా జరిగినప్పుడు అతని తరఫున వారసులకు వాటిని బదిలీ చేసే వ్యక్తి అన్నమాట. అందుకే నామినీగా సొంత వారినే కాదు.. బయట వారినీ నియమించుకునే అవకాశం ఉంది.
పెట్టుబడులకు అసలు యజమాని మరణించిన సందర్భంలో.. వాటిని అతని వారసులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా అందించేందుకు నామినీ తోడ్పడతారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, డీమ్యాట్ ఖాతా, చిన్న మొత్తాల పొదుపు, బ్యాంకు ఖాతాలు, జీవిత బీమా పాలసీలు.. ఇలా ప్రతి చోటా నామినీ అవసరం ఉంటుంది.
ఒకవేళ ఒక ఖాతాదారుడు నామినీ పేరు రాయలేదనుకుందాం. ఆ ఖాతాదారుడికి ఏదైనా జరిగినప్పుడు బ్యాంకు సంబంధిత వ్యక్తి వారసుల కోసం చూస్తుంది. వారు వచ్చిన తర్వాత వారసత్వ ధ్రువీకరణను కోరుతుంది. లేదా వీలునామా అవసరమని చెప్పొచ్చు. ఇవన్నీ పూర్తయ్యేనాటికి ఎంతో సమయం పడుతుంది. ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం బ్యాంకు ఖాతాల్లో ఎవరూ పట్టించుకోని సొమ్ము దాదాపు రూ.25,000 కోట్ల వరకూ ఉంది. ఈ మొత్తం అంతా నామినీ వివరాలు సరిగా లేకపోవడమే కారణం.
ఒక వ్యక్తి వీలునామా రాసినప్పుడు.. నామినీ.. ఆ మేరకు వారసులకు ఆస్తులను అందించాల్సి ఉంటుంది. అంతేకానీ, నామినీగా పేరు రాసినంత మాత్రాన మొత్తం అతనికి/ఆమెకే చెందదు. నామినీ పేరును ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు.
బ్యాంకు ఖాతాలో ఒకరిని నామినీగా పేర్కొనవచ్చు. ఉమ్మడి ఖాతా ఉంటే.. ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. జీవిత బీమా పాలసీల్లో ఎంతమంది నామినీలనైనా పేర్కొనవచ్చు. పాలసీ విలువలో ఎవరికి ఎంత శాతం చెందాలన్నది వివరించాలి. ఈపీఎఫ్‌లోనూ ఇలాంటి వెసులుబాటు ఉంటుంది. డీమ్యాట్ ఖాతాలోనూ ఒకరికంటే ఎక్కువ నామినీలుగా ఉండేందుకు అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat - Shah rukh Fans: విరాట్ - షారుక్ ఖాన్ ఫ్యాన్స్ ట్విటర్ వార్.. ఓ యూజర్ సూపర్ ట్వీట్
-
Politics News
Karnataka: మే 10నే ఎన్నికలు.. కాంగ్రెస్‌లో చేరికలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
KTR: తెలంగాణకు ఏమీ ఇవ్వని మోదీ మనకెందుకు: మంత్రి కేటీఆర్
-
India News
Immunity boosting: మళ్లీ కరోనా కలకలం.. ఈ ఫుడ్‌తో మీ ఇమ్యూనిటీకి భలే బూస్ట్!
-
Movies News
Anushka Sharma: పన్ను వివాదంలో లభించని ఊరట.. అనుష్క శర్మ పిటిషన్ కొట్టివేత