‘వాల్యూ ఇన్వెస్టింగ్‌’ పై విశ్వాసం ఉంటే...

దీర్ఘకాలంలో మూలధన వృద్ధి సాధించే లక్ష్యంతో ‘యాక్సిస్‌ వాల్యూ ఫండ్‌’ అనే పథకాన్ని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకువచ్చింది.

Updated : 03 Sep 2021 01:39 IST

యాక్సిస్‌ వాల్యూ ఫండ్‌

దీర్ఘకాలంలో మూలధన వృద్ధి సాధించే లక్ష్యంతో ‘యాక్సిస్‌ వాల్యూ ఫండ్‌’ అనే పథకాన్ని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకువచ్చింది. ఈ కొత్త పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.5,000. ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ కాబట్టి ఎన్‌ఎఫ్‌ఓ ముగిసిన తర్వాత యూనిట్ల క్రయవిక్రయాలు ప్రారంభం అవుతాయి. ‘వాల్యూ ఇన్వెస్టింగ్‌’ వ్యూహం ప్రకారం ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 200 టీఆర్‌ఐ సూచీతో దీని పనితీరును పోల్చి చూస్తారు. దీనికి జినేష్‌ గొపానీ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. మార్కెట్లో ఇప్పటికే వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల నుంచి వాల్యూ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. పరిమితమైన రిస్కు, స్థిరమైన ప్రతిఫలం ఇలాంటి పథకాలకు ఉన్న ప్రత్యేకత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని