రీట్స్‌లో మదుపు కోసం

‘మహీంద్రా మనులైఫ్‌ ఆసియా పసిఫిక్‌ రీట్స్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ అనే ఒక ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌)ను మహీంద్రా మనులైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ఈ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ అక్టోబరు 12. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌.

Updated : 01 Oct 2021 06:22 IST

‘మహీంద్రా మనులైఫ్‌ ఆసియా పసిఫిక్‌ రీట్స్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’

‘మహీంద్రా మనులైఫ్‌ ఆసియా పసిఫిక్‌ రీట్స్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ అనే ఒక ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌)ను మహీంద్రా మనులైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ఈ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ అక్టోబరు 12. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌. కనీస పెట్టుబడి రూ.5,000. తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం ఉండాలని, అంతర్జాతీయంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు ఆకర్షణీయమైన భావించే మదుపరులకు ఈ ఫండ్‌ అనువైనది. ఇటీవల కాలంలో రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (రీట్స్‌) ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనాలుగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం విదితమే. అంతేగాక స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడులతో పోల్చితే కొంత భిన్నమైన పెట్టుబడిగా, స్ధిరమైన ఆదాయాన్ని ఇచ్చేవిగా వీటికి ఆదరణ లభిస్తోంది.

‘మహీంద్రా మనులైఫ్‌ ఆసియా పసిఫిక్‌ రీట్స్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ కింద సేకరించిన నిధులను ఆసియా, పసిఫిక్‌ దేశాల్లోని రీట్స్‌లో పెట్టుబడిగా పెడతారు. ఈ పథకం పనితీరును మనులైఫ్‌ గ్లోబల్‌ ఫండ్‌- ఆసియా పసిఫిక్‌ రీట్‌ ఫండ్‌తో పోల్చి చూస్తారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని రీట్స్‌లో రిటైల్‌, కమర్షియల్‌, ఇండస్ట్రియల్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆఫీసు స్థలానికి, మాల్స్‌, పారిశ్రామిక పార్కులకు, హోటళ్లు- పర్యావరణ ప్రాజెక్టులకు గిరాకీ పెరుగుతున్నట్లు, దీనివల్ల రీట్స్‌లో పెట్టుబడి ఆకర్షణీయమైన ప్రతిఫలాన్ని అందిస్తున్నట్లు మహీంద్రా మనులైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఈ కొత్త  మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని తీసుకువచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని