చిన్న మొత్తాల పొదుపు
ఇటీవల కాలంలో బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. దీంతో సురక్షితమైన పథకాల్లో మదుపు చేయాలనుకునే వారు ప్రత్యామ్నాయ పథకాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు గతంతో పోలిస్తే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోనూ వడ్డీ రేట్లు
వడ్డీ రేట్లు మారలేదు
ఇటీవల కాలంలో బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. దీంతో సురక్షితమైన పథకాల్లో మదుపు చేయాలనుకునే వారు ప్రత్యామ్నాయ పథకాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు గతంతో పోలిస్తే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోనూ వడ్డీ రేట్లు ఎంతో తగ్గాయి. అయితే, గత కొంతకాలంగా వీటిపైన వడ్డీ రేట్లు ప్రభుత్వం తగ్గించలేదు. దీన్ని ఈసారీ కొనసాగిస్తూ.. డిసెంబరు 31, 2021 వరకూ పాత వడ్డీ రేట్లే అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. సాధారణంగా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను ప్రభుత్వం సవరిస్తూ ఉంటుంది. గత ఆరు త్రైమాసికాలుగా ఈ రేట్లను తగ్గించకపోవడం గమనార్హం. దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)పైన 7.1శాతం రాబడి వస్తుండగా.. 10 ఏళ్ల లోపు అమ్మాయిల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక పథకం సుకన్య సమృద్ధి యోజనలో 7.6 శాతం వార్షిక రాబడి అందుతోంది.
రెండు వారాల్లో ఆర్బీఐ పరపతి సమీక్ష ఉన్న నేపథ్యంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గకపోవడం చిన్న మదుపరులకు ఊరటగానే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు సవరించకపోతే.. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు తగ్గవు. ఇది చాలామందికి ప్రయోజనం కలిగించేదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్