అధిక ప్రతిఫలం అందించేలా...

ఎన్‌జే మ్యూచువల్‌ ఫండ్‌ తన మొదటి మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ఆవిష్కరించింది. అది బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌ కావడం ఆసక్తికరమైన అంశం. ఇటీవల

Published : 15 Oct 2021 03:26 IST

న్‌జే మ్యూచువల్‌ ఫండ్‌ తన మొదటి మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ఆవిష్కరించింది. అది బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌ కావడం ఆసక్తికరమైన అంశం. ఇటీవల కాలంలో పలు ఏఎంసీ (అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ)లు బ్యాలెన్స్‌డ్‌ పథకాలు తీసుకొస్తున్న విషయం విదితమే. ఈ కోవలోనే ‘ఎన్‌జే బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌’ను ఈ సంస్థ తీసుకొచ్చింది. దీని ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 22. కనసీ పెట్టుబడి రూ.500. నిఫ్టీ 50 హైబ్రీడ్‌ కాంపోజిట్‌ డెట్‌ 50:50 ఇండెక్స్‌తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. ఈ ఫండ్‌ పెట్టుబడులపై అధిక ప్రతిఫలాన్ని ఆర్జించేందుకు ‘రూల్‌-బేస్డ్‌ అప్రోచ్‌’ను అనుసరిస్తుంది. ఈ పద్ధతిలో ఫండ్‌ మేనేజర్‌ విచక్షణ తక్కువగా ఉంటుంది. ముందుగా నిర్దేశించిన, గణాంకాల ఆధారిత అంశాల ప్రకారం పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ పథకాలు ఈక్విటీల్లో, రుణ పత్రాల్లో పెట్టుబడి పెడతాయి. మార్కెట్‌ స్థితిగతులు, వడ్డీ రేట్లు, సంబంధిత ఇతర అంశాలను పరిగణనలోనికి తీసుకొని, పెట్టుబడులను ఈక్విటీ వైపు లేదా రుణ పత్రాలకు ఏ మేరకు మళ్లించాలనే నిర్ణయం తీసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని