వ్యక్తిగత రుణాలు.. వడ్డీ రేట్లు..

అవసరం ఏదైనా సరే.. అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేవి వ్యక్తిగత రుణాలు. గతంలో వీటికి అధిక వడ్డీ ఉండేది. కానీ, ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గిన కారణంగా..

Published : 15 Oct 2021 03:29 IST

అవసరం ఏదైనా సరే.. అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేవి వ్యక్తిగత రుణాలు. గతంలో వీటికి అధిక వడ్డీ ఉండేది. కానీ, ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గిన కారణంగా.. ఇవీ తక్కువకే లభిస్తున్నాయి. పండగల వేళ.. పలు బ్యాంకులు ప్రత్యేకంగా ఈ వడ్డీని తగ్గిస్తున్నాయి కూడా. ఈ నేపథ్యంలో రూ.5లక్షలు, రూ.లక్ష వ్యక్తిగత రుణానికి వర్తించే వడ్డీ, 5 ఏళ్ల వ్యవధికి చెల్లించాల్సిన నెలవారీ వాయిదాల మొత్తం ఎలా ఉంటుందనే వివరాలు మీ కోసం...

బ్యాంకులు పండగల సందర్భంగా వడ్డీ రేట్లలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఇది కేవలం అవగాహన కోసమే. క్రెడిట్‌ స్కోరు ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పు ఉంటుంది. సాధారణంగా రుణం ఇచ్చేటప్పుడు ప్రాసెసింగ్‌ ఫీజు 2.5శాతం నుంచి గరిష్ఠంగా రూ.25వేల వరకూ ఉంటుంది. ప్రస్తుతం ఈ రుసుములను దాదాపు అన్ని బ్యాంకులూ డిసెంబరు 31 వరకూ రద్దు చేశాయి. వ్యక్తిగత రుణం కోసం మీరు బ్యాంకుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని మర్చిపోవద్దు. పూర్తి వివరాలకు మీ బ్యాంకును సంప్రదించండి. 

- Paisabazaar.com

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని