Investments: స్మాల్‌ క్యాప్‌ సూచీలో

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక స్మాల్‌ క్యాప్‌ పథకాన్ని తీసుకువచ్చింది. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 26. కనీస పెట్టుబడి రూ.100. ‘నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 250 ఇండెక్స్‌’ తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు.

Updated : 22 Oct 2021 06:06 IST

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్‌

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక స్మాల్‌ క్యాప్‌ పథకాన్ని తీసుకువచ్చింది. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 26. కనీస పెట్టుబడి రూ.100. ‘నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 250 ఇండెక్స్‌’ తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. ఈ సూచీ గత అయిదేళ్ల కాలంలో సగటున 14.8 శాతం ప్రతిఫలాన్ని అందించింది. గత ఏడాది కాలంలో 88.9 శాతం ప్రతిఫలం ఉంది. స్మాల్‌ క్యాప్‌ తరగతిలో ఇప్పటికే పలు పథకాలు ఉన్నాయి. కానీ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్లు తక్కువ. స్మాల్‌ క్యాప్‌ తరగతికి చెందిన ఫండ్లలో అధిక రిస్కు, అధిక ప్రతిఫలం సర్వసాధారణం. అందువల్ల రిస్కు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్న మదుపరులు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకువచ్చిన స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను పరిశీలించవచ్చు.


మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా

ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌

ఇటీవల కాలంలో వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌లను తీసుకొచ్చాయి. ఇదే కోవలో ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ నవంబరు 3. ఇందులో కనీస పెట్టుబడి పెట్టుబడి రూ.5,000. ‘ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ హైబ్రీడ్‌ కాంపొజిట్‌ 50 : 50 ఇండెక్స్‌’ ఈ పథకం పనితీరును పోల్చిచూస్తారు. బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు అటు ఈక్విటీలో, ఇటు రుణపత్రాల్లో పెట్టుబడి పెట్టి తక్కువ రిస్కుతో స్ధిరమైన లాభాలు ఆర్జించటానికి ప్రయత్నాలు చేస్తాయనేది తెలిసిన విషయమే. సాధారణంగా ఈ నిష్పత్తి 65 : 35 ఉంటుంది. ఈ కోవలోనే ఎల్‌ఐసీ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ ముందుకు సాగుతుందనుకోవచ్చు. వడ్డీరేట్లు పెరిగినప్పుడు ఈక్విటీ మార్కెట్లలో ‘కరెక్షన్‌’ వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు, ఈక్విటీ పెట్టుబడులు తగ్గించి రుణ పత్రాలకు పెట్టుబడులు పెంచే అవకాశం ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్లుగా అటూఇటూ పెట్టుబడులు మార్చేందుకు ఫండ్‌ మేనేజర్‌ ప్రయత్నిస్తారు. స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల్లో రిస్కు పెరిగిపోయిందని భావించే మదుపరులు, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టే అంశాన్ని పరిశీలించవచ్చు. అటువంటి వారికి ఈ పథకం అనుకూలమే.


ఫార్మా సంస్థల్లో పెట్టుబడ్ఞి

ఐటీఐ ఫార్మా అండ్‌ హెల్త్‌కేర్‌ ఫండ్‌

ఐటిఐ మ్యూచువల్‌ ఫండ్‌.. ఐటీఐ ఫార్మా అండ్‌ హెల్త్‌కేర్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు వచ్చే నెల 1వ తేదీ. ఫార్మా, ఆస్పత్రులు, వైద్య ఉపకరణాలు, ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్‌ సేవల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడి పెడుతుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ప్రదీప్‌ గోఖలే, రోహన్‌ కోర్డే దీనికి ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ఎన్నో ఏళ్ల పాటు దేశీయ ఫార్మా రంగం స్టాక్‌మార్కెట్లో పెద్దగా ప్రతిఫలాన్ని ఇవ్వలేదు. కానీ కొవిడ్‌-19 తో మార్పు వచ్చింది. గత ఏడాదిన్నర కాలంలో ఫార్మా, వైద్య సేవల కంపెనీల షేర్లు గణనీయంగా పెరిగి మదుపరులకు మంచి లాభాలు ఇచ్చాయి. ఈ సానుకూలత వచ్చే కొన్నేళ్ల పాటు కొనసాగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ఐటీఐ ఫార్మా అండ్‌ హెల్త్‌కేర్‌ ఫండ్‌ను ఈ రంగంలో తమకు పెట్టుబడి ఉండాలనుకునే మదుపరులు దీన్ని గమనించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని