Published : 29 Oct 2021 04:54 IST

నష్టభయం ఉన్నా... రాబడి మిన్న

పెట్టుబడులు ఎప్పుడూ నష్టాలనే మిగులుస్తాయి.. దీనికన్నా... సురక్షితంగా ఉన్న చోట డబ్బులు దాచుకోవడం మేలు... ఈ ఆలోచన ఎంతోమందికి ఉంటుంది. అందుకే, తక్కువ రాబడినిచ్చే చోట తమ డబ్బును నిల్వ చేస్తుంటారు. సగటున ద్రవ్యోల్బణం 6 శాతం అనుకుంటే.. అంతకు మించి కనీసం 2 లేదా మూడు శాతం అధిక రాబడి వచ్చినప్పుడే భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాలు తీరతాయి. నష్టం వస్తుందని పెట్టుబడులు మొత్తానికే ఆపేస్తే అంతకు మించిన నష్టం మరోటి ఉండదు. మనకు తెలియని దాని గురించి భయపడటం అనేది సహజమే. స్టాక్‌ మార్కెట్‌ కూడా ఇలాంటిదే. ఎవరో నష్టపోయారని చెప్పి, విజేతల గురించి మర్చిపోతుంటాం. డబ్బుతో డబ్బు సంపాదించాలంటే.. ముందుగా మనం దాని గురించి అర్థం చేసుకోవాలి. ఎక్కడ నష్టపోతున్నాం. ఎక్కడ లాభాలు వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. నష్టాలు తగ్గి, లాభాలు వచ్చేలా పెట్టుబడుల జాబితాను రూపొందించుకోవాలి. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లో కాస్త హెచ్చుతగ్గులున్నాయి. అంతమాత్రాన ఇందులో మదుపు చేసేందుకు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మార్కెట్లో నేరుగా షేర్లలోనే మదుపు అవసరం లేదు. ఇక్కడ మనకు సహాయం చేసేందుకు నిపుణులూ ఉంటారు. వారి ద్వారా మన పెట్టుబడులను నిర్వహించుకునే వీలూ ఉంటుంది. సరైన సమయం కోసం ఎదురుచూడటం కన్నా.. దీర్ఘకాల దృష్టితో ఇందులో కొనసాగడమే మంచిది. చిన్న వయసులో ఉన్నవారు.. అధిక నష్టభయం భరించే వీలుంటుంది కాబట్టి, ఎక్కువ భాగం ఈక్విటీలకు కేటాయించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఈక్విటీల నుంచి సురక్షిత పథకాల్లో పెట్టుబడిని పెంచాలి. నష్టభయాన్ని.. సమయానుకూలంగా పరిమితం చేసుకుంటే రాబడి మిన్నగానే ఉంటుందని మర్చిపోవద్దు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని